నో వ్యాక్సిన్.. నో వేకెన్సీ.. నో వికాస్.. గళమెత్తిన భారతమాత ముద్దు బిడ్డలు.. ఖాళీ పోస్టుల సంఖ్య చూస్తే షాక్

నో వ్యాక్సిన్.. నో వేకెన్సీ.. నో వికాస్.. గళమెత్తిన భారతమాత ముద్దు బిడ్డలు.. ఖాళీ పోస్టుల సంఖ్య చూస్తే షాక్

NoVaccineNoVacancy
NoVaccineNoVacancy

నో వ్యాక్సిన్.. నో వేకెన్సీ.. నో వికాస్.. గళమెత్తిన భారతమాత ముద్దు బిడ్డలు.. ఖాళీ పోస్టుల సంఖ్య చూస్తే షాక్

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే నినాదం.. నో వ్యాక్సిన్.. నో వేకెన్సీ. భరతమాత ముద్దుబిడ్డలు, యువత పెద్ద ఎత్తున ఈ నినాదంతో ముందుకు కదులుతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఈసారి 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. వీరే దేశానికి, కుటుంబాలకు వెన్నుముక. అలాంటి వారు కరోనాతో చనిపోతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తుందని అంటున్నారు ప్రజలు. వ్యాక్సిన్ అందుబాటులో లేక.. కరోనా నుంచి రక్షణ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 2021, జూన్ 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రెండు డోసులు తీసుకున్న వారు 3 శాతంగా ఉంటే.. ఒక్క డోస్ తీసుకున్న వారు 13 శాతంగానే ఉంది. అంటే ఇంకా దేశ జనాభాలో 77 శాతం మంది కనీసం ఒక డోస్ కూడా తీసుకోలేదు. ఎక్కడికి వెళ్లినా నో వ్యాక్సిన్ బోర్డులే కనిపిస్తున్నాయి.

కరోనా, లాక్ డౌన్, నేలకు దిగిన ఆర్థిక వ్యవస్థ ద్వారా 2021 మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే.. అంటే 90 రోజుల్లో దేశవ్యాప్తంగా కోటి 50 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధి కల్పించకపోగా.. 2020, 2021 ఇప్పటి వరకు.. అంటే ఏడాదిన్నర కాలంలో రెండు కోట్ల ఉద్యోగాలు పోయాయి. ఏడేళ్ల కాలంలో తీసుకుంటే నిరుద్యోగం రేటు ఆల్ టైం హైకి చేరింది.

> ఇండియన్ ఆర్మీలో 86 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> దేశవ్యాప్తంగా 10 లక్షల 60 వేల 139 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> గ్రూప్ C కేడర్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 75 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> గ్రూప్ B కేడర్ లో కేంద్ర ప్రభుత్వం పరిధిలో 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> గ్రూప్ A కేడర్ లో కేంద్ర ప్రభుత్వం శాఖల్లొో 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
> ఇండియన్ నేవీలో 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
> కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో లక్షా 7 వేల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పుడు నో వ్యాక్సిన్, నో వేకెన్సీ.. నో వికాస్.. అంటే అభివృద్ధి కూడా లేదు అంటున్నారు యువత.

బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి సరాసరి 2 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయారని చెబుతున్నాయి లెక్కలు.

ఇదే సమయంలో నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, రవాణా ఛార్జీల ధరలు మూడింతలు పెరిగాయి. ఎలా బతకాలి అనేది ఇప్పుడు పాయింట్..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు