తీరంలో జూనియర్ ఎన్టీఆర్ తుఫాన్.. అధినేతకు మైండ్ బ్లాంక్ చేసిన తమ్ముళ్లు

తీరంలో జూనియర్ ఎన్టీఆర్ తుఫాన్.. అధినేతకు మైండ్ బ్లాంక్ చేసిన తమ్ముళ్లు

తీరంలో జూనియర్ ఎన్టీఆర్ తుఫాన్.. అధినేతకు మైండ్ బ్లాంక్ చేసిన తమ్ముళ్లు

కృష్ణా జిల్లా బందరులో తెలుగు తమ్ముళ్లలో చీలిక వచ్చింది. అది కూడా అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పడిన ఈ తుఫాన్ కు కారణం జూనియర్ ఎన్టీఆర్ కావటం విశేషం. మచిలీపట్నంలో జూలై 14వ తేదీ చంద్రబాబు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు ఏ రోడ్డు మార్గంలో అయితే వెళతారో ఆ రహదారుల్లో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు బందరు సిటీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే.. జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగలేదు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ప్లెక్సీలపై పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు.

బందరులో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న అభిమానులను ఓ చూపు చూశారు. కాకపోతే ఎలాంటి కామెంట్ చేయలేదు. సైలెంట్ చూస్తూ వెళ్లారు.

బందరు మూడు స్తంభాల సెంటర్ లో రోడ్డుపైనే కార్యకర్తలతో ముచ్చటించారు చంద్రబాబు. ఈ సందర్భంగా జై చంద్రబాబు.. జై బాలయ్య అని కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. మరికొందరు అయితే చంద్రబాబు ఎదుటే జై ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు.. అన్నీ గమనిస్తూనే.. మౌనంగా ముందుకు సాగిపోయారు.

మొన్న చిత్తూరు.. ఇవాళ మచిలీపట్నంలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు