TV5 చేతిలో ఘోరంగా ఓడిన Ntv నరేంద్రచౌదరి

TV5 చేతిలో ఘోరంగా ఓడిన Ntv నరేంద్రచౌదరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఎన్టీవీ ప్యానెల్ గెలుపొందలేదు. 15కు 15 మంది సభ్యులను టీవీ5 ప్యానెల్ గెలుపొందటం సంచలనంగా మారింది. 15 ఏళ్లు ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానంలో ఉన్న ఎన్టీవీ నరేంద్రచౌదరి ప్యానెల్ చాలా ఘోరంగా ఓడిపోయింది.

Ntv narendra chowdary losses by tv5 in Jubilee Hills Society elections
Ntv narendra chowdary losses by tv5 in Jubilee Hills Society elections

ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులు, ఏపీ, తెలంగాణకు చెందిన సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, ఇతర పారిశ్రామికవేత్తలతోపాటు వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదించిన ధనవంతులు అందరూ నివాసం ఉండే జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఎన్నికల్లో Ntv న్యూస్ ఛానల్ నరేంద్రచౌదరి ప్యానెల్ ఘోరంగా ఓడిపోయింది. మార్చి 21వ తేదీ ఆదివారం.. 15 ఏళ్ల తర్వాత జరిగిన సొసైటీ ఎన్నికల్లో టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ కు చెందిన జూబ్లీహిల్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ( జేహెచ్‌డబ్ల్యూఎస్‌) ప్యానెల్‌ ఘన విజయం సాధించింది.

15 మంది మేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీవీ నరేంద్రచౌదరికి ప్యానెల్ జూబ్లీహిల్స్ టీం ఫ్యానెల్ పేరుతో బరిలోకి దిగింది. అయితే ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఎన్టీవీ ప్యానెల్ గెలుపొందలేదు. 15కు 15 మంది సభ్యులను టీవీ5 ప్యానెల్ గెలుపొందటం సంచలనంగా మారింది. 15 ఏళ్లు ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానంలో ఉన్న ఎన్టీవీ నరేంద్రచౌదరి ప్యానెల్ చాలా ఘోరంగా ఓడిపోయింది.

జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌లో జరిగిన పోలింగ్‌లో 3 వేల 181మంది సభ్యులకు ఒక వెయ్యి 757మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాతలు దిల్‌రాజు, కేఎస్‌.రామారావు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ వాణీదేవి సహా పెద్ద సంఖ్యలో ప్రముఖులు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘ఓట్‌ ఫర్‌ చేంజ్‌’ నినాదంలో బరిలోకి దిగిన టీవీ5కు చెందిన జూబ్లీహిల్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ (జేహెచ్‌డబ్ల్యూఎస్‌ )ప్యానెల్‌ సభ్యులు స్పష్టమైన ఆధిక్యత కనబర్చారు.

ఎస్‌సీ కేటగిరిలో జేహెచ్‌డబ్ల్యూఎస్‌ ప్యానెల్‌ తరఫున పోటీచేసిన మాజీ కేంద్రమంత్రి జేడీ.శీలం సతీమణి సుజాత శీలం విజయం సాధించారు. మహిళా కేటగిరిలోని రెండు సీట్లను టీవీ5 ప్యానెల్ కైవసం చేసుకుంది. ఈ ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన ఆదాల హిమబిందురెడ్డి, డి.సునీలారెడ్డి విజయం సాధించారు. వీరితో పాటు జనరల్‌ కేటగిరిలో ప్యానెల్‌ తరఫున పోటీ చేసిన 12మంది సభ్యులు విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో సుజాత శీలం, ఆదాల హిమబిందురెడ్డి, డి.సునీలారెడ్డి, ఎం.ఆనంద్‌కుమార్‌, డా.ఓమ్‌ ప్రకాశ్‌అగర్వాల్‌, కుసుమ్‌కుమార్‌ జెట్టి, గరికపాటి శ్రీనువాసులు, పి.నాగరాజు, కే.నాగేంద్రప్రసాద్‌, బి.రవీంద్రనాథ్‌, వీవీ.రాజేంద్రప్రసాద్‌, మాదాడి శ్రీలక్ష్మీరెడ్డి, ఆర్‌.మాధవ్‌రెడ్డి, ఏ.మురళీముకుంద్‌, ఎస్‌.సతీశ్‌చంద్రారెడ్డి ఉన్నారు.

టీవీ5 ప్యానెల్ తరపున టీవీ5 ఎండీ రవీంధ్రనాథ్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అటు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. 15 ఏళ్లు అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీవీ నరేంద్రచౌదరి.. తన ప్యానెల్ నుంచి ఒక్కరు అంటే ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోవటం.. ఆయన పాలన తీరు, వ్యూహం ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు