ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయితే.. టీడీపీలో సంబురాలు ఏంటీ ?

ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయితే.. టీడీపీలో సంబురాలు ఏంటీ ?

ఓ తెలుగు వ్యక్తి. దేశంలోని అత్యున్నత పదవుల్లోని ఓ స్థానంలో నియమితులయ్యారు. త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఓ తెలుగు వ్యక్తిగా అందరికీ గర్వకారణమే అయినా.. ఆయనకు పదవి వచ్చిందంటూ.. తెలుగుదేశం పార్టీలో.. వారి సోషల్ మీడియాలో.. కొన్ని సామాజిక వర్గాలకు చెందిన మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ఆయా ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసిన వారు, “ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయితే సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు వచ్చిన లాభ నష్టాలు ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు“, అంటూ సామాన్య జనం నుంచి ఇలాంటి మాటలు వినిపించటం వల్లే ఇలాంటి వార్త రాయాల్సి వస్తోంది.

చట్టానికి, ధర్మానికి, బంధు ప్రీతికి లొంగకుండా.. పక్షపాతం చూపించకుండా న్యాయాన్ని నాలుగు కాళ్లపై.. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు, బంధువులు, చుట్టాలు వంటి భావోద్వేగాలకు గురి కాకుండా, ప్రభుత్వాలను, వ్యవస్థలను సైతం సన్మార్గంలో పెట్టగలిగిన అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థ.

telugu desam party

అలాంటి ఓ వ్యవస్థకు ఎవరు చీఫ్ జస్టిస్ అయినా.. ధర్మానికి, న్యాయానికి, చట్టానికి కట్టుబడి తీర్పు ఇవ్వాల్సిందే. ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి సంబంధించిన వారు అయినా సరే.. రాజ్యాంగ బద్దంగా.. న్యాయ వ్యవస్థకు లోబడి పని చేయాల్సిందే.

తెలుగు వ్యక్తికి గౌరవం లభించింది అన్నంత వరకు వార్త సరే.. అది జనరల్ నాలెడ్జ్. అంతకు మించి కొన్ని పత్రికలు, ఛానల్స్, టీడీపీ సోషల్ మీడియాలో కీర్తిస్తూ వెళ్లటం,కొందరికి మూడింది.. మళ్లీ జైలుకు వెళతారు అంటూ కొటేషన్స్ పెట్టటం విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్లకు వారు తెలియకుండానే దేశంలోనే అత్యున్నతమైన ఓ వ్యక్తికి, వ్యవస్థకు మరక అంటించిన వారు అవుతారన్న సంగతిని మర్చిపోతున్నారు.

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కుల రాజకీయం.. నిక్కరేసుకున్న పిల్లోడికి కూడా అర్థం అవుతుంది.. ఆ విధంగా తయారు చేశారు వ్యవస్థను. ఇప్పుడు అది దేశంలోనే అత్యున్నత స్థాయి వ్యక్తులను సైతం వదలకుండా వెంటాడుతుంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి… గౌరవించాల్సిన స్థాయిలో ఉన్నారు.. అలాంటి మనిషిపై ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే విజ్ణత లేకుండా వ్యవహరించటం వల్ల.. సామాన్యుల్లో సైతం మనకేంటి లాభం అనే మాటలకు ఆస్కారం ఇచ్చినవాళ్లవుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు