రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు, భారతీయులకు సుపరిచితుడు. ఎనిమిదేళ్లపాటు అమెరికాను పాలించిన ఒబామా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అమెరికాకు రెండవం నల్లజాతి అధ్యక్షుడిగా పనిచేసిన తోలి వ్యక్తి ఒబామానే. ఇతనికంటే ముందు 1848 లో ఫెడరిక్ డౌగ్లాస్ మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక తాజాగా ఒబామా తన ఆత్మకత రాశారు. ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ అనే పేరుతొ కొద్దీ రోజుల క్రితం ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది.

అయితే ఈ పుస్తకంలో ఆయన చాలా విషయాలను పొందుపరిచారు. అమెరికా అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లో ప్రజలతో మమేకమైన సందర్భాల్లో ఒక అధ్యక్షుడిని కలిసినప్పుడు ప్రజల ఆనందం ఎలా ఉంటుందో అని వివరించారు. ఇక పలువురు రాజకీయ నాయకుల గురించి కూడా తన పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను పరిపక్వత లేని రాజకీయ నేతగా అభివర్ణించారు ఒబామా..

‘రాహుల్ గాంధీ నర్వస్డ్ గా ఉన్నారు. ఆయనలో ఒక తెలియని లక్షణం ఉంది. ఏదైనా కోర్సు చేసే విద్యార్థి.. తన ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవడానికి ఆత్రుతగా ఉన్నట్టు కనబడతాడు. కానీ లోతుగా విషయాలను అవగాహన చేసుకునే గుణం.. ఆ పట్టుదల అతడిలో కనిపించడం లేదు. ’ అంటూ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఇక ఈ పుస్తకంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ప్రస్తావించారు.

మన్మోహన్ సింగ్ ఒక అస్పష్టమైన చిత్తశుద్ధిని కలిగి ఉన్నారు. అమెరికాలో రక్షణ శాఖ కార్యదర్శి బాబ్ గేట్స్ కూడా ఇలాంటి వారే. ’ అంటూ రాశారు. వీరిరువురే గాక ఒబామా.. తాజాగా యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బిన్ లాడెన్ మరణం సమయంలో దారితీసిన పరిస్థితులను వివరిస్తూ రాశాడు. ఇక ఈ పుస్తకంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా రాశారు ఒబామా

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు