పెంపుడు కుక్కల్లో పెరుగుతున్న ఒబేసిటీ, గుండె జబ్బులు

పెంపుడు కుక్కల్లో పెరుగుతున్న ఒబేసిటీ, గుండె జబ్బులు

కరోనా కాలం మనుషులనే కాదు జంతువులనూ వెంటాడుతోంది. ఏడాది కాలంలో ఎక్కువగా లాక్ డౌన్ కే పరిమితం అయ్యారు జనం. అదే సమయంలో బయటకు వెళ్లటం 70 శాతం తగ్గిపోయింది. ఇది మనుషులపై చూపిస్తున్న ప్రభావం కంటే.. ఇంట్లో పెంచుకునే కుక్కలపై అంతుకు రెట్టింపు స్థాయిలో ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఆరు నెలలుగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అనూహ్యంగా బరువు పెరిగాయంట. అదే విధంగా గుండె జబ్బులు, బీపీలు పెరగటంతోపాటు.. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నట్లు ముంబై, గోవా రాష్ట్రాల్లోని పశువుల డాక్టర్లు వివరించారు.

కొన్ని నెలలుగా కుక్కలకు అనారోగ్యం అంటూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని.. ఆల్ మోస్ట్ మూడింతలు అయ్యిందని వివరించారు.

కరోనా, లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ ఎక్సర్ సైజ్ మిస్ అవుతున్నాయంట కుక్కలు. కొందరు అయితే కరోనా బారిన పడటంతో వాటి సంరక్షణ, ఆరోగ్యం విషయం అశ్రద్ధ వహించటం ఓ కారణం. వీధుల్లో సంచారం లేకపోవటం వల్ల కుక్కల అరుపులు లేవు.. వీధుల్లో తిరిగే సమయం తగ్గిపోయింది.. తినే ఫుడ్ క్వాంటిటీ పెరగటం వల్ల ఇంట్లోని కుక్కల్లో అధిక బరువు, బీపీ విపరీతంగా పెరిగినట్లు డాక్టర్ పింటో వివరించారు.

రెండేళ్లుగా కుక్కల్లో కార్డియాక్ అరెస్ట్.. అంటే ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత సడెన్ గా చనిపోవటం వంటి కేసులు పెరిగాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇప్పటికైనా పెంపుడు కుక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు