హైదరాబాద్ లో పరిస్థితి దారుణం : గాంధీలో ప్రతి 10నిమిషాలకో కరోనా పేషెంట్

huge rush at gandhi hospital

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 15వ తేదీ ఒక్క రోజే 3 వేల 850 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. అయినా లాక్ డౌన్ లేదు.. కర్ఫ్యూ లేదు.. వ్యాపారాలు మామూలుగానే జరుగుతున్నాయి.. జనం తిరిగేస్తున్నారు.. వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో.. జనంలోకి ఎంతలా పాకిపోయిందో.. గాంధీ ఆస్పత్రిలో సిట్యువేషన్ చూస్తే అర్థం అవుతుంది.

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ ఆస్పత్రికి ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ వస్తున్నారు. అంటే గంటకు ఆరుగురు.. రోజుకు 144 మంది ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అవుతున్నారు. దీంతో గాంధీ ఆస్పత్రి కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతోంది. అదనపు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నా.. అవి కూడా ఒక రోజులోనే ఫుల్ అయిపోతున్నాయి. ఇదే విధంగా కొనసాగితో.. రాబోయే రెండు రోజుల్లో అంటే.. ఏప్రిల్ 18వ తేదీ నాటికి గాంధీ ఆస్పత్రిలో నో బెడ్స్.. హౌస్ ఫుల్ బోర్డు పెట్టనున్నారు.

గాంధీ ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంకెలా ఉందో అనేది ఇప్పుడు పాయింట్. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇప్పుడు నో బెడ్ అనే మాట వినిపిస్తుంది. రోజు లక్ష రూపాయలు కట్టగలిగే ఆర్థిక స్తోమత ఉంటేనే బెడ్ దొరుకుతుంది సిటీలో.. సిటీ శివార్లకు వెళ్లినా రోజుకు 50 వేల రూపాయలు కడితేనే.. బెడ్ లభించే దుస్థితి ఉంది.

గాంధీ ఆస్పత్రికే ప్రతి పది నిమిషాలకు ఓ కరోనా రోగి.. ఇన్ పేషెంట్ గా అడ్మిన్ అవుతుంటే.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగినా ఆశ్చర్యం లేదు. నిమిషానికి ఒకరు వస్తే.. ట్రీట్ మెంట్ చేయటానికి ఆస్పత్రులు, సిబ్బంది, డాక్టర్లు, నర్సులు దొరకరు కూడా..

హైదరాబాద్ లో కరోనా బీభత్సంగా వ్యాప్తి జరుగుతున్నా.. కేవలం మాస్క్, సామాజిక దూరం అనే నినాదంతోనే ప్రభుత్వం పరిమితం అయ్యింది. ఆంక్షలు విధించకపోవటంతో కరోనా లేదనే భరోసాతో తిరిగేస్తున్నారు జనం. భయం లేకుండా.. లక్షణాలు లేకుండా తిరిగేస్తున్న కరోనా రోగులు.. వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు.

తమ దాక వచ్చేంత వరకు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుకుంటే.. మీదాక వచ్చేప్పటికి మీకు బెడ్లు, వైద్యం చేయడానికి హాస్పటల్స్ ఉండవు. ప్లీజ్ పరిస్థితి అర్థం చేసుకోండి.. నిర్లక్ష్యం వదిలేసి జాగ్రత్తగా ఉండండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు