కోటి రూపాయల లంచం కేసులో మరోవ్యక్తి ఆత్మహత్య

కోటి రూపాయల లంచం కేసులో మరోవ్యక్తి ఆత్మహత్య

కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. ఇక నాగరాజు ఆత్మహత్య మరువకముందే కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు.

కొద్దీ రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన ఆయన ఇంటివద్దే ఉంటున్నారు. కాగా తెల్లవారుజామున కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ధర్మారెడ్డి. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్‌ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు.

ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు