ఇక నుండి డబుల్ మాస్క్ : రెండు మాస్క్ లు ధరించాల్సిందే అంటున్న డాక్టర్లు

one should wear double mask doctors suggest

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు.. మనకు వైరస్ సోకకుండా ఉండేందుకు మాస్క్ విధిగా పెట్టుకోవాలని చెబుతోంది ప్రభుత్వం. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పెట్టుకునే మాస్క్ ఎంత రక్షణ ఇస్తుంది అంటే డౌటే అంటున్నారు వైద్యులు.

ప్రస్తుతం దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్.. మొదటిసారి వచ్చినదాని కంటే ఎక్కువ శక్తి వంతంగా ఉందంట. ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్నారు వైద్యులు. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలి అంటే ఒక మాస్క్ పెట్టుకుంటే సరిపోదని.. రెండు మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

ఒక మాస్క్ పెట్టుకున్నా.. అది రెండు లేయర్స్ గా ఉండాలని.. సింగిల్ లేయర్ ది పనికి రాదని తేల్చి చెబుతున్నారు డాక్టర్లు. ఏదో షో కోసం.. జరిమానా విధిస్తారనే ఉద్దేశంతో మాస్క్ పెట్టుకోవద్దని.. కచ్చితంగా రెండు లేయర్స్ లేదా రెండు మాస్కులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

ఇక నుండి డబుల్ మాస్క్ : రెండు మాస్క్ లు ధరించాల్సిందే అంటున్న డాక్టర్లు

అమెరికాకు చెందిన జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టం అయ్యింది. మార్కెట్ తో లభించే సర్జికల్ మాస్క్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. మన ఇండియాలో లభించే కర్ఛీఫ్ లాంటి మండపాటి వస్త్రంతో తయారు చేసిన మాస్క్ అయితే బెటర్ అంటున్నారు.

డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఏదీ ఊరికే చెప్పరు కదా.. కరోనా సిట్యువేషన్ ఎంత డేంజర్ గా ఉంటే చెబుతారు ఈ విషయాన్ని.

అందుకే అందరూ అప్రమత్తం అవ్వండి. సింగిల్ లేయర్ మాస్క్ కాదు.. డబుల్ లేయర్ మాస్క్ పెట్టుకోండి.. లేదా రెండు మాస్కులు పెట్టుకోండి.. కరోనా నుంచి రక్షణ పొందండి అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు