కొంప ముంచిన గుడ్డ పీలికలు – సూర్యపేట గ్యాలరీ కూలడానికి కారణం ఇదే

Over 100 injured as stand collapses at Kabaddi championship in Suryapet

సూర్యాపేటలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో చోటు చేసుకున్న అపశృతిలో, నిర్వహాకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. కబడ్డీ పోటీలను చూడటానికి ఏర్పాటు చేసిన గ్యాలరీ స్టాండ్ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తేలింది.

దాదాపు 20 అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో 5 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీ నిర్మాణానికి సాధారణ సెంట్రింగ్ కర్రలతో పునాది నిర్మాణం చేశారు. గ్యాలరీ నిర్మాణంలో వాడిన స్టీల్, ఐరన్ రాడ్లను కట్టి ఉంచడానికి మేకులు,బైండింగ్ వైర్లకు బదులు గుడ్డ పీలికలను వాడారు. 5 వేల మంది కూర్చున్నా ఏం జరగకుండా స్థిరంగా ఉండాల్సిన ఈ నిర్మాణం కేవలం 15 వందల మంది ఎక్కగానే కుప్ప కూలింది అంటే దానికి కారణం సెంట్రింగ్ కర్రలు , గుడ్డపీలకలే అనేది స్పష్టంగా కనపడుతుంది.

వేల సంఖ్యలో ప్రజలు కూర్చుంటారని తెలిసినా, అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి, గుడ్డపీలికలు, సెంట్రింగ్ కర్రలు నిర్మాణాన్ని పట్టి ఉంచలేవనే కనీస జ్ఞానం లేకపోవడంది ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 100 మందికి పైగా అమాయకులు ఈ నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైన గాయాలతో ఆసుపత్రుల పాలు అయ్యారు. అప్పటి వరకు ఉన్న ఉత్సాహం, ఆనందం క్షణాల్లో ఆర్తనాథాలుగా మారిపోయాయి.ఈ ఘటనలో ఎవరు మృతి చెందక పోవడం కాస్త ఊరట కలిగించే విషయమే అయినప్పటికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లను, గ్యాలరీని సర్టిఫై చేసిన అధికారులపై విచారణకు ఆదేశించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు