పాకిస్తాన్ లో ఢీకొన్న రెండు ప్యాసింజర్ రైళ్లు 33 మంది మృతి.

దక్షిణ పాకిస్థాన్ లోని సింధ్ ప్రోవిన్సులో జూన్ 7 ఉదయం రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి.దాదాపు 33 మంది మృతి చెందగా 120 మందికి పైగా గాయపడ్డారు.

అధికారిక నివేదిక ప్రకారం సింధ్ ప్రావిన్స్‌లో కరాచీ నుండి వస్తున్న “మిల్లట్ ఎక్స్‌ప్రెస్” ధార్కి ప్రాంత సమీపంలో పట్టాలు తప్పి మరో ట్రాక్‌లోకి వచ్చింది. ఇదే సమయంలో రావల్పిండి నుండి వస్తున్న “సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్” పట్టాలు తప్పిన ఈ కంపార్ట్‌మెంట్లను ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై స్పందిస్తూ ఈ వార్త తనని షాక్ కి గురి చేసింది అని మరియు పూర్తీ విచారణకి ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఆ దేశ రైల్వే శాఖ మంత్రి అక్కడికి చేరుకొని సహాయక చర్యలని పర్యవేక్షించారు.

ప్రమాదానికి గురైన ప్రదేశానికి రెస్క్యూ హెలికాప్టర్లు, అంబులెన్సులు, ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బందిని పంపినట్లు పాకిస్తాన్ మిలటరీ తెలిపింది.

అయితే పాకిస్తాన్‌లో రైల్వే ప్రమాదాలు కొత్త కాదు, తరచుగా పట్టాలు తప్పడం మరియు మానవరహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఢీకొనడం జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ట్రాక్‌లు మరియు సిగ్నల్ వ్యవస్థలను నిర్వహించడానికి సరి అయినా నిధులను విడుదల చేయడం లేదు అనేది ఒక వాదన.

2019 లో కూడా లియాఖత్పూర్ పట్టణానికి సమీపంలో ఒక ప్యాసింజర్ రైలులో గ్యాస్ డబ్బా పేలి మంటలు చెలరేగడంతో దాదాపు 73 మంది మరణించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు