అంతా మీ ఇష్టమేనా ? ఏంపీ ఎన్నికలు కూడా బహిష్కరించండి : పనబాక లక్ష్మి అలక

మరో 12 రోజుల్లో తిరుపతి పోలింగ్ జరుగుతున్న సమయంలో.. గ్రామస్థాయిలో జరిగే పరిషత్ ఎన్నికలను బహిష్కరించటం వల్ల తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నేతల మనో దైర్యం దెబ్బతినదా అని ప్రశ్నించారంట.

అంతా మీ ఇష్టమేనా ? ఏంపీ ఎన్నికలు కూడా బహిష్కరించండి : పనబాక లక్ష్మి అలక

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన కొంత మందికి జీర్ణం కావటం లేదు. నామినేషన్ల ఉపసంహకరణ సైతం పూర్తయిన తర్వాత.. కేవలం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో.. బహిష్కరణ ఏంటీ అనే వాదన పార్టీ నేతల నుంచే వినిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్స్ అశోక్ గజపతిరాజు, జ్యోతుల నెహ్రు బహిరంగంగానే విమర్శించారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించిన తర్వాత.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో నిలబడిన పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట. పరిషత్ ఎన్నికల్లో ఓడిపోతామని బహిష్కరించాం.. మరి తిరుపతి ఎన్నికల్లో గెలుస్తామా.. భారీ మెజార్టీ వస్తుందా.. కచ్చితంగా గెలుస్తామనే బరిలోకి నిలిచామా.. ఓడిపోతాం అని తిరుపతి ఎన్నికలను బహిష్కరించలేదు కదా అని ప్రచారంలోని పార్టీ సీనియర్ల దగ్గర ప్రస్తావించారంట.

అంతా మీ ఇష్టమేనా ? ఏంపీ ఎన్నికలు కూడా బహిష్కరించండి : పనబాక లక్ష్మి అలక

మరో 12 రోజుల్లో తిరుపతి పోలింగ్ జరుగుతున్న సమయంలో.. గ్రామస్థాయిలో జరిగే పరిషత్ ఎన్నికలను బహిష్కరించటం వల్ల తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నేతల మనో దైర్యం దెబ్బతినదా అని ప్రశ్నించారట.స్థానిక నేతలతో కనీసం సంప్రదింపులు లేకుండా MPTC,ZPTC ఎన్నికలను బహిష్కరించినట్టు తిరుపతి ఉప ఎన్నికను కూడా నాకు తెలియకుండా బహిష్కరిస్తే పరిస్థితి ఏంటని పనబాక లక్ష్మి ఆందోళ చెందుతున్నారు.

ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు జరిగాయి అంటున్నారు.. రేపు తిరుపతిలో ఓడిపోతే కూడా ఇలాగే అంటారా అని అసహనం వ్యక్తం చేశారంట. పోటీ చేస్తున్న అభ్యర్థి పనబాక లక్ష్మినే ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో షాక్ అయ్యారంట సీనియర్ నేతలు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచన వచ్చినప్పుడు.. ఆ తర్వాత వారం రోజులకే జరగనున్న తిరుపతి ఎన్నికను దృష్టిలో పెట్టుకోవాల్సి అని అంటున్నారు ఆమె.

పరిషత్ ఎన్నికల బహిష్కరణ తిరుపతి ఉప ఎన్నికలో ఓట్ల శాతంపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారు పనబాక లక్ష్మి. ఆమె సామాన్యురాలు కాదు. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా గుర్తింపుపొందారు. చంద్రబాబు జెడ్పీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం.. తిరుపతిలో పార్టీ ఓటింగ్ పై పడే అవకాశం ఉంది. గతంలో 40 శాతంపైగా ఓట్లు సాధించాం.. ఇప్పుడు అంత శాతం రాకపోతే పరిస్థితి ఏంటీ అనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.

నామినేషన్ల పూర్తయ్యి.. బ్యాలెట్ పేపర్లు ముద్రణ కూడా కంప్లీట్ అయిన క్రమంలో.. ప్రధాన ప్రతిపక్షం పార్టీ ఇలా బహిష్కరణకు పిలుపునివ్వటం ద్వారా.. పోటీలో ఉన్న అభ్యర్థుల సంగతి ఏంటీ అనేది ఆలోచన చేస్తే బాగుండేదని అంటున్నారంట పనబాక లక్ష్మి.

See also : నడి సముద్రంలో ఎలా వదిలేస్తారు బాబుగారు – అభ్యర్థుల ఆవేదన

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు