పవన్ కల్యాణ్ కు కరోనా నెగెటివ్ : అభిమానుల పూజలే బతికించాయన్న పవర్ స్టార్

pawan kalyan about his corona negative report

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనాను సమర్ధవంతంగా జయించారు. మే 8వ తేదీ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని స్వయంగా ప్రకటించారు. మరికొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉండటం జరుగుతుందని తెలిపారు.

తన ఆరోగ్యం కోసం పూజలు చేసిన అభిమానులు, జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు పవన్ కల్యాణ్.

కరోనా వైరస్ దేశంలో ఉధృతంగా ఉందని.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. కరోనాను దైర్యంగా ఎదుర్కోవాలని.. మానసిక దైర్యంగా ఉన్నప్పుడే వైరస్ నుంచి శరీరం నుంచి పారద్రోలవచ్చన్నారు.

ప్రస్తుతం ఫాంహౌస్ లో ఉన్న పవన్ కల్యాణ్.. మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారు. మరో పది రోజులు అందరికీ దూరంగా ఉంటానని.. కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు పవన్ కల్యాణ్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు