టీడీపీతో పవన్ కల్యాణ్ ఎప్పటికీ కలవలేడు.. కారణం ఇదే అంటున్న వైసీపీ

టీడీపీతో పవన్ కల్యాణ్ ఎప్పటికీ కలవలేడు.. కారణం ఇదే అంటున్న వైసీపీ

టీడీపీతో పవన్ కల్యాణ్ ఎప్పటికీ కలవలేడు.. కారణం ఇదే అంటున్న వైసీపీ

ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట నడుస్తోంది. జాతీయ పార్టీలు బీజేపీ – కాంగ్రెస్ బలం ఏంటో అందరికీ తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీడీపీ – జనసేన ఈక్వేషన్స్ లోనే లెక్కలు ఉండబోతున్నాయి. ఈ ఈక్వేషన్స్ లో అందరి కంటే హ్యాపీగా ఉంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి కారణం కూడా వాళ్లే చెబుతున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ఒంటరిగానే వెళుతుంది.. భవిష్యత్ లోనూ ఇదే మా వైఖరి అని చెబుతోంది. ఆ పార్టీ వరకు ఎవరికీ అనుమానాలు లేకపోయినా.. టీడీపీ – జనసేన మళ్లీ కలిస్తే బాగుంటుందని అనే వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పుడున్న పొజిషన్ లో టీడీపీతో.. జనసేన పార్టీ కలవటం అనేది అసాధ్యం అనే టాక్ పొలిటికల్ సర్కిళ్లు వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలను నారా లోకేష్ చూస్తున్నారు. టీడీపీ తరపున కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఉంది. చంద్రబాబు వారసుడిగా టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ సీఎం అవుతారు. రాజకీయాల్లో తన కంటే జూనియర్ అయిన లోకేష్ తో కలిసి పవన్ కల్యాణ్ పని చేస్తారా అనేది ఇప్పుడు డౌట్. చంద్రబాబు కోసం పని చేయటం అంటే.. ఆయన 40 ఏళ్లు ఇండస్ట్రీ.. ఇప్పుడు కుమారుడు లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ ఎలా ముందుకొస్తారని ప్రశ్నిస్తున్నారు కొందరు.

లోకేష్ ను సీఎంను చేయటం కోసం పవన్ కల్యాణ్ కష్టపడితే జనసేన పార్టీకి విలువ మరింత తగ్గుతుందనేది వైసీపీ నేతల మాట. నారా కుటుంబం కోసమే జనసేన ఉందా అనే సంకేతాలు జనంలోకి వెళతాయని.. దీని వల్ల జనసేన బలమే తగ్గిపోతుంది అంటున్నారు. లోకేష్ – పవన్ కళ్యాణ్ ను పోల్చి చూసుకున్నప్పుడు పవన్ చాలా సీనియర్.. అలాంటి వ్యక్తి వెళ్లి లోకేష్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ కోసం పని చేస్తే అది జనసేన ఉనికికే ప్రమాదం అంటున్నారు రాజకీయ నేతలు.

ఇవన్నీ ఆలోచించే టీడీపీకి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. టీడీపీ – జనసేన సైతం ఎప్పటికీ కలవవు అంటున్నారు. అది జరిగితే జనసేనకే నష్టం అనే అభిప్రాయంలో ఉంది.. అందుకు తగ్గట్టు ఎత్తుగడులు సిద్ధం చేసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు