సీఎం పదవి వచ్చేలోపు.. కేంద్ర మంత్రిని చేస్తాం : పవన్ పై బీజేపీ వ్యూహం

సీఎం పదవి వచ్చేలోపు.. కేంద్ర మంత్రిని చేస్తాం : పవన్ పై బీజేపీ వ్యూహం పవన్ కల్యాణ్ ను తనవైపు తిప్పుకోవటానికి ఇప్పటికే..

pawan Kalyan become a central minister in bjp government
pawan Kalyan become a central minister in bjp government

జనసేన పార్టీని పూర్తిగా అదుపులో పెట్టుకోవటానికి బీజేపీ వ్యూహం రచిస్తోంది. పొత్తు చిత్తు కాకుండా బలంగా నిర్మించుకునేందుకు.. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నుంచి తన ప్లాన్ సిద్ధం చేసింది బీజేపీ

పవన్ కల్యాణ్ ను పువ్వులా చూసుకోవాలని ప్రధాని మోడీ సైతం చెప్పినట్లు రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు స్పష్టం చేశారు. ఆ వెంటనే సీఎం అభ్యర్థి అని బహిరంగంగా ప్రకటించేశారు. ఏపీకి పవన్ కల్యాణ్ ఎప్పుడు సీఎం అవుతారు అంటే మాత్రం టైం చెప్పలేం.. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ పొత్తు మారకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

సీఎం ఎప్పుడు అవుతారు అనేది క్లారిటీ లేదు అన్నది స్పష్టంగా చెప్పలేం కాబట్టి.. అప్పటి వరకు పవన్ కల్యాణ్ గోడ దూకకుండా.. మరో పార్టీ వైపు చూడకుండా.. బీజేపీతోనే ఉండే విధంగా మంచి ఆఫర్ ఇచ్చింది. కేంద్రంలో బీజేపీకి ఎదురులేదు.. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిని చేయాలని ఆలోచిస్తుంది.

లోక్ సభ నుంచి ప్రత్యక్ష బరిలోకి ఇప్పట్లో దిగే ఛాన్స్ లేదు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ ఎంపీగా చేసి.. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవితో సీఎంకు తగిన స్థాయి హోదా పవన్ కల్యాణ్ కు కల్పించాలని భావిస్తోంది బీజేపీ.

పవన్ కల్యాణ్ ను తనవైపు తిప్పుకోవటానికి ఇప్పటికే ఎల్లో మీడియా ద్వారా టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని పసిగట్టిన బీజేపీ.. ఏపీ, తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ను కేంద్ర మంత్రిని చేయాలని నిర్ణయించింది. సేమ్ టూ సేమ్ అన్నయ్య చిరంజీవి విషయంలో కాంగ్రెస్ వ్యూహాన్నే తమ్ముడి విషయంలో బీజేపీ చేస్తుంది.

మరి ఈ ఆఫర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఒక వేళ పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి పదవి తీసుకోకపోతే.. బీజేపీతో కటీఫ్ చెప్పినా ఆశ్చర్యం లేదనే టాక్ సైతం వినిపిస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు