పవన్ కల్యాణ్ పువ్వు.. ఏపీకి కాబోయే సీఎం.. పెద్దాయనే చెప్పారు

పవన్ కల్యాణ్ పువ్వు.. ఏపీకి కాబోయే సీఎం.. పెద్దాయనే చెప్పారు, బీజేపీ - జనసేన పాత్తు చిత్తు అవుతుందని ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో.. రాబోయే కాలానికి

Pawan Kalyan become a future CM in andhra pradesh
Pawan Kalyan become a future CM in andhra pradesh

జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ పువ్వు లాంటి వారని.. ఆయన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. పవన్ కల్యాణ్ అంటే ప్రధాని మోడీకి ఎంతో అభిమానం అని.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని తనకు చెవిలో చెప్పినట్లు వీర్రాజు కార్యకర్తల మీటింగ్ లో సెలవిచ్చారు. రాబోయే కాలంలో.. కాబోయే సీఎం పవన్ అంటూ ఆకాశానికెత్తారు.

పవన్ కల్యాణ్ ను బీజేపీ పొగడ్తలతో ముంచెత్తటానికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అని అందరికీ తెలిసినా.. కాబోయే లీడర్ అని చెప్పటం చూస్తుంటే.. బీజేపీలో జనసేన శాశ్వత విలీనం అవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానిగా మోడీ రెండోసారి పవర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మూడు సార్లు ఢిల్లీ వెళ్లినా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి వచ్చారు.

అయినా సరే.. పవన్ కల్యాణ్ పువ్వు లాంటోళ్లు అని.. చాలా జాగ్రత్తగా చూసుకోవాలని.. ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సీఎం అభ్యర్థిని ముందుకు ప్రకటించటం అంటే సాహసమే అని చెప్పాలి. బీజేపీ – జనసేన పాత్తు చిత్తు అవుతుందని ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో.. రాబోయే కాలానికి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అనే ప్రకటన బీజేపీ నుంచి రావటం.. అందరి కంటే తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు..

పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ కంటే సినీ స్టార్ గా బాగా పాపులర్.. 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్నా సోషల్ మీడియాలో ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సొంతంగా సోషల్ మీడియాను పెట్టుకుని.. రాజకీయంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ బిల్డర్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం అయ్యి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని 294 నియోజకవర్గాల్లో క్యాండెంట్లను తయారు చేసుకోలేకపోయినా.. పొత్తుల ద్వారా తన పార్టీ ఉనికి నిరంతరం కాపాడుకుంటూ వస్తున్నారు పవన్ కల్యాణ్. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తన పవర్ ఏంటో.. పొత్తు పార్టీ బీజేపీ నోటి నుంచి మాటలు కొత్త చర్చకు దారి తీశాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు