కరోనా హోం క్వారంటైన్ లోకి పవన్ కల్యాణ్ : జాగ్రత్తగా ఉండాలని పిలుపు

కరోనా హోం క్వారంటైన్ లోకి పవన్ కల్యాణ్ - ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు పిలుపు

జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. వారం రోజులు ఎవరికీ ప్రత్యక్షంగా కనిపించరు. దీనికి కారణం కరోనా. పవన్ కల్యాణ్ కు కరోనా రాకపోయినా.. ఆయన చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది, ఇతర ఉద్యోగుల్లో చాలా మంది కరోనా బారిన పడ్డారంట.

విషయం తెలిసిన వెంటనే.. పవన్ కల్యాణ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు.. ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్లారు పవన్.

రాబోయే వారం, 10 రోజులు పవన్ కల్యాణ్ టెలి కాన్ఫరెన్స్, వీడియో కాల్ రూపంలో పార్టీ కార్యకర్తలు, నేతలకు దశా నిర్దేశం చేయనున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా.. ఇతర ఉద్యోగులు, నేతలు, అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొన్ని రోజులుగా తనతో ప్రత్యక్షంగా మీటింగ్స్, సమావేశాలు, చర్చల్లో పాల్గొన్న వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు పాత్ర పోషించాలని.. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.

janasena letter head covid home

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు