తిరుపతి ఎంపీ సీటు ఇవ్వండి – ఢిల్లీలో పవన్ కల్యాణ్

బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి బరిలోకి దిగాలి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ప్రకటించిన తర్వాత.. ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వటం వెనక ఉద్దేశం ఏంటీ అనేది ఆసక్తి రేపుతోంది.

జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. జీహెచ్ఎంసీలో త్యాగం చేసినందుకు.. ఏపీలోని తిరుపతి ఎంపీ సీటును జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేశారంట.
తెలంగాణలో ఎన్నికలకు.. ఏపీలో రాబోయే ఎన్నికలకు లింక్ పెట్టటం ఏంటీ అని బీజేపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారంట

తెలంగాణ – ఏపీ రాష్ట్రాలను వేర్వేరుగా చూడాలని.. ఒకటిగా ఎలా చూస్తారని బీజేపీ అంటోంది
తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది.. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి బరిలోకి దిగాలి అనేది పవన్ కల్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది.
దీనికి ఏపీ బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు