నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది..

pavana kalyan covid positive

జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ కు కరోనా తగ్గిపోయింది. నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 16వ తేదీ కరోనా వచ్చిందని.. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో.. ఫాంహౌస్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ప్రకటించింది జనసేన పార్టీ. ముక్కుకు ఆక్సిజన్ అందిస్తున్న ఫొటో విడుదల చేసింది పార్టీ.

కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎన్నో పూజలు, హోమాలు చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ అందరూ ఆకాంక్షించారు. వారి పూజలు ఫలించినట్లు ఉన్నాయి.. నాలుగు రోజుల్లో కరోనాను జయించారు పవన్ కల్యాణ్. ఏప్రిల్ 20వ తేదీ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

కరోనా నెగెటివ్ వచ్చినా.. మరికొన్ని రోజులు అంటే 10 రోజులు అయినా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారంట. ఎవరినీ కలవకపోతేనే మంచిదని.. అందరికీ దూరంగా.. హోం ఐసోలేషన్ లోనే ఉండాలని చెప్పారంట. ఆరోగ్య భద్రత రీత్యా.. డాక్టర్ల సూచనతో.. వారం, పది రోజులు పవన్ కల్యాణ్ ఐసోలేషన్ లోనే ఉండనున్నారు.

పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా పర్వాలేదు.. ఆయన మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు అది చాలు అంటున్నారు ఫ్యాన్స్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు