బీజేపీ నేతల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం – క్లారిటీ ఇవ్వకపోవటంపై రుసరుసలు

బీజేపీ నేతల తీరుపై పవన్ కల్యాణ్ అసహనం - క్లారిటీ ఇవ్వకపోవటంపై రుసరుసలు.. గతంలో గెలిచిన స్థానం.. ఓటు బ్యాంక్ బాగుంది.. అలాంటిది ఏకపక్షంగా కేటాయించటం సాధ్యం కాదని.. చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకుందాం

ఢిల్లీ వెళ్లిన రెండు రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్ మెంట్ దొరికింది. అది కూడా చాలా తక్కువగా సమయం కావటం.. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లు సాగటంతో అసహనంగా ఉన్నారంట. మీటింగ్ జరిగినా తాను అనుకున్నది నెరవేరకపోవటంతో రుసరుసలాడుతూ బయటకు వచ్చారంట జనసేన అధినేత.

జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకోవటానికి ప్రతిఫలంగా తిరుపతి ఎంపీ సీటు జనసేన పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. తిరుపతిలో బీజేపీలో మంచి పట్టు ఉంది.. గతంలో గెలిచిన స్థానం.. ఓటు బ్యాంక్ బాగుంది.. అలాంటిది ఏకపక్షంగా కేటాయించటం సాధ్యం కాదని.. చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకుందాం అని స్పష్టం చేశారంట జేపీ నడ్డా.

తిరుపతి ఎంపీ సీటు కోసం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు అని తెలిసిన వెంటనే ఏపీ బీజేపీ నేతలు.. భారీ ఎత్తున నివేదికలు సమర్పించారంట. జనసేన పార్టీకి ఏకపక్షంగా హామీ ఇవ్వొద్దని ఒత్తిడి చేశారంట. తిరుపతిలో ఓట్ల శాతం. బీజేపీకి ఉన్న బలాన్ని ఆధారాలతో సహా ఢిల్లీకి ఫ్యాక్స్ పంపించారంట.
పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లు హామీ ఇవ్వని జేపీ నడ్డా.. తిరుపతి ఎంపీ సీటు అభ్యర్థి ఎంపికపై బీజేపీ – జనసేన పార్టీ సభ్యులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుందాం అని.. దానికి ఇంకా సమయం ఉంది.. తొందరలేదు.. మరోసారి మాట్లాడుకుందాం అని వెల్లడించారంట. తిరుపతి పోటీలో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని కూడా స్పష్టం చేశారంట పవన్ జేపీ నడ్డా.

బీజేపీ హైకమాండ్ ఇంత స్పష్టంగా చెప్పేయటం.. అభ్యర్థి ఎంపికపై కమిటీ వేస్తామని చెప్పటంతో బయటకు వస్తూనే పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

రెండు రోజులు వెయిట్ చేయించి.. ఎలాంటి హామీ ఇవ్వకుండా.. ఈ మాట చెప్పించుకోవటానికా ఢిల్లీ వచ్చింది అంటూ రుసరుసలాడారు అంట. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ముఖంలో పెద్దగా ఆనందం లేదు. దానికి కారణం ఇదే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు