పవన్ కల్యాణ్ పై కేసు నమోదు పక్కానా – ఎఫ్ఐఆర్ చేస్తారా.. కోర్టుకు లాగుతారా..

పవన్ కల్యాణ్ పై కేసు నమోదు పక్కానా - ఎఫ్ఐఆర్ చేస్తారా.. కోర్టుకు లాగుతారా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న.. చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ రాజకీయ పార్టీ అయ్యి ఉండి.. ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం కొత్త కాకపోయినా.. ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతిలో బీజేపీ – జనసేన కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కడప జిల్లా పులివెందుల ప్రాంతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పులి వెందుల పేరుతో.. పులివెందుల పేరు మీద దౌర్జన్యాలు చేస్తారు.. చేస్తున్నారు. పులివెందుల అనేది దుర్మార్గాలకు, దోపిడీకి అడ్రస్‌గా మారిపోయింది. మానవ హక్కులు కాలరాస్తున్నారు.. ఫ్యాక్షన్ గుండాలకు భయపడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల నుంచి సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం జగన్ ను టార్గెట్ చేసి.. ఏకంగా పులివెందుల, కడప జిల్లాపైనే తన ప్రతాపం అంతా చూపించారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సహజంగా కౌంటర్ ఇచ్చారు. అంతటి ఆగలేదు ఈసారి. పులివెందుల మున్సిపల్ చైర్మన్, వరప్రసాద్, కౌన్సిలర్లు, ఇతర నేతలు, పులివెందులకు చెందిన సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు పోలీస్ స్టేషన్ గడప తొక్కాయి. పులివెందుల ప్రాంతాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడారని.. అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ గోపీనాథ్ కు కంప్లయింట్ కాపీ అందించారు.

జనసేన, టీడీపీ కలిసి పదేపదే రాయలసీమను, కడప ప్రాంతాన్ని కించపరుస్తూ అవమానిస్తున్నారని.. సీమ గూండాలని.. పులివెందుల రౌడీలంటూ ఎందుకు ప్రజల్లో ముద్ర వేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. పులివెందుల అంటేనే ప్రేమ, అనురాగాలు, ఆత్మీయత, పౌరుషానికి పెట్టింది పేరని.. అలాంటి ప్రాంతంపై ఫ్యాక్షన్, రౌడీలు, గూండాల ముద్ర వేయటం ఏంటని ప్రజాసంఘాలు ఈసారి గట్టిగా నిలదీస్తున్నాయి.

పవర్ అంతా వైఎస్ఆర్ కాంగ్రనెస్ పార్టీ చేతిలో ఉండటంతో.. ఈసారి గట్టిగానే కంప్లయింట్ నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కోర్టుకు ఈడ్చాలని.. అలా అయినా పవన్ కల్యాణ్ కు పులివెందుల అంటే ఏంటో తెలుస్తుంది అంటున్నారు పులివెందుల జనం. ఏమైనా ఈసారి పవన్ కల్యాణ్ గట్టిగానే కేసు నమోదయ్యేలా ఉంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు