విస్కీ తాగుతున్న టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

విస్కీ తాగుతున్న టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెరిగిపోయింది. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మందు తాగుతుంటారు. ఇక సినిమా వారి గురించి చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీక్రెట్ గా మందుతాగుతారని గుసగుస.. పబ్బులకు, ఫారిన్ ట్రిప్పులకు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి అక్కడి వాతావరణం తట్టుకోవాలి అంటే పెగ్గు వెయ్యాల్సిందే.

అయితే చాలామంది హీరోయిన్లు తాము మందుతాగుతామని పబ్లిక్ గా చెప్పరు. ఎందుకంటే వారి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి.. తమను సమాజం డ్రింకర్స్ గా లెక్కవేస్తోందని వాళ్ళ బాధ.. అయితే పాయల్ రాజ్ పుత్ మాత్రం మందు బాటిల్ ముందు పెట్టుకొని మందు గ్లాస్ లో పట్టుకొని ఉన్న ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

అయితే ఆమె పట్టుకుంది మందు గ్లాసే కానీ తాగుతున్నారా లేదా అనేది డౌట్.. ఎదో ఫొటోకు ఫోజ్ ఇచ్చేందుకు పట్టుకున్నారని అనుకుంటున్నారు చాలామంది. అయితే ఓ మందు బ్రాండ్ ప్రకటనలో భాగంగా ఆమె ఇలా యాక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు