అంత ఆత్రం ఏంటిరా బాబూ! బ్లాక్ లో ఎగబడి మరీ మందు కొన్నారు.. తీరా విషయం తెలిసి లబోదిబో అని ఏడుపు..

lock down for liquor

తెలంగాణ లాక్ డౌన్ అని బ్రేకింగ్ రాగానే.. ఎప్పటి నుంచి.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు.. మినహాయింపులు ఏంటీ.. రేపటి నుంచి ఉద్యోగం, ఉపాధి సంగతి ఏంటీ అనేది విషయాన్ని పక్కనపెట్టి.. మందు షాపుల వైపు క్యూ కట్టారు మందు బాబులు.. ఆ షాపు ఈ షాపు అని లేదా.. ఎక్కడపడితే అక్కడ ఎగబడ్డారు..

రోడ్ల పక్కన వైన్ షాపుల దగ్గర రద్దీ తట్టుకోలేక.. మాల్స్, వైన్ మార్ట్ లాంటి షాపుల వైపు పరుగులు తీశారు. అక్కడా సేమ్ సీన్. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వేల 200 వైన్ షాపుల దగ్గర సిట్యువేషన్ ఇది. చాలా వైన్ షాపుల్లో గంటల్లోనే స్టాక్ మొత్తం అయిపోయింది. ఇక బార్లలోని లిక్కర్ ను సైతం బార్ల ధరలకు అమ్మేశారు..

ఇదే అదునుగా కొందరు బ్లాక్ మార్కెట్ చేశారు. యూత్ ను టార్గెట్ చేసి బీర్లను బ్లాక్ మార్కెట్ చేశారు. లాక్ డౌన్ 10 రోజులు కాదు.. నెల రోజులు అయినా ఉండొచ్చు అని భయపెట్టి.. ఒక్కో బీర్ బాటిల్ ను అదనంగా 50 రూపాయలకు అమ్మారు.. వాటిని సైతం కొనుక్కున్నారు మందుబాబులు. బ్లాక్ మార్కెట్ లో బీరు బాటిల్ పై 50 రూపాయలు నడిస్తే.. హాట్ ఫుల్ బాటిల్ పై 200 రూపాయలు నడిచింది. టైం గడిచేకొద్దీ మందు దొరకదేమో అన్నట్లు ఎగబడి బ్లాక్ మార్కెట్ లో కొన్నారు.. ఫుల్ స్టాక్ చేసుకున్నారు. వెయ్యికి పైగా వైన్ షాపుల్లో స్టాక్ లేక మూసివేశారు.

వేలకు వేలు పెట్టి షాపుల్లో.. బ్లాక్ మార్కెట్ లో కొనుకున్న లిక్కర్ ను ఇంటికి తీసుకెళ్లిన ఆనందం కొన్ని నిమిషాలు కూడా లేదు. లాక్ డౌన్ ఉన్నా.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయి అనే వార్త.. మందు బాబులను షాక్ కు గురి చేసింది. అయ్యే ఉన్న డబ్బులన్నీ మందుకే తగలేశామా అని కొందరు ఫీలయితే.. ఛీ.. దీనెమ్మ జీవితం అనవసరంగా బ్లాక్ లో కొన్నాం కదరా.. ఆ డబ్బులే ఉంటే నాలుగు రోజులు బిర్యానీ తినేవాళ్లం అంటూ లబోదిబో అనుకున్నారు…

అయిపోయింది ఏదో అయిపోయింది కానీ.. టేకిట్ ఈజీ అని కొనుక్కున్న మందుతో ఎంజాయ్ చేయండి.. అదే ఫీల్ అయితే తాగింది కూడా ఎక్కదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు