28న కేసీఆర్ బహిరంగ సభ – 29న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

28న కేసీఆర్ బహిరంగ సభ - 29న హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్ బహిరంగ సభ మైలేజ్ ను తగ్గించి.. బీజేపీ వైపు హైదరాబాద్ ఓటర్లను అటెన్షన్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ టూర్ అప్పటికప్పుడు కన్ఫామ్ అయినట్లు

Modi-KCR

జీహెచ్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీని దాటి పార్లమెంట్ ఎన్నికల స్థాయిని తలపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. దుబ్బాక విజయం తర్వాత బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. జాతీయ స్థాయి నేతలను తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తోంది. అగ్రనేతలు అందరూ వరసపెట్టి హైదరాబాద్ వస్తున్నారు. అందుకు ధీటుగా టీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహిస్తోంది. 28వ తేదీ సాయంత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్.

ఎల్బీ స్టేడియం సభతో పోలింగ్ ముందు తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యింది టీఆర్ఎస్ పార్టీ. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సుదీర్ఘ స్పీచ్ ద్వారా మీడియా అటెన్షన్ వస్తుందని.. తద్వారా ఓటర్లను డైవర్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది అని మాస్టర్ ప్లాన్ వేసింది టీఆర్ఎస్. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది.

సరిగ్గా ఇక్కడే బీజేపీ సైతం అందుకు పైఎత్తు వేసింది. 28వ తేదీ సాయంత్రం కేసీఆర్ సభ అయిపోయిన వెంటనే.. కొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి మోడీని హైదరాబాద్ తీసుకొస్తోంది. ప్రధాని మోడీ వచ్చేది జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి కాదు.. భారత్ బయోటెక్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నారు. ఈ కంపెనీనే కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ఇప్పటికే ట్రయిల్స్ నిర్వహిస్తోంది. 29వ తేదీ హకీంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం వచ్చే ప్రధాని మోడీ.. అక్కడి నుంచి భారత్ బయోటెక్ కంపెనీకి వెళతారు. వ్యాక్సిన్ తయారీ, ట్రయిల్స్ పురోగతిని పరిశీలించనున్నారు.

29వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీ హైదరాబాద్ లోనే ఉండనున్నట్లు సమాచారం. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా.. అకస్మాత్తుగా మోడీ హైదరాబాద్ టూర్ ఖరారు కావటం సంచలనంగా మారింది.

ప్రైవేట్ కార్యక్రమం అని చెబుతున్నా.. సీఎం కేసీఆర్ బహిరంగ సభ మైలేజ్ ను తగ్గించి.. బీజేపీ వైపు హైదరాబాద్ ఓటర్లను అటెన్షన్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ టూర్ అప్పటికప్పుడు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీపై బీజేపీ గట్టిగానే దృష్టి పెట్టింది అని చెప్పాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు