8వ తేదీ.. రాత్రి 8 గంటలకు.. కరోనాపై ఏం ప్రకటన రాబోతున్నది

8వ తేదీ.. రాత్రి 8 గంటలకు.. కరోనాపై ఏం ప్రకటన రాబోతున్నది.. సంపూర్ణ లాక్ డౌన్ అయితే విధించే పరిస్థితి ఉండదని.. పాక్షికంగా మూసివేతలు ఉండొచ్చు అంటున్నారు. రద్దీగా ఉండే

PM Modi to hold a video-conference with CM’s of all States on 8th April

8వ తేదీ.. రాత్రి 8 గంటలకు.. కరోనాపై ఏం ప్రకటన రాబోతున్నది

ఏప్రిల్ 8వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో అత్యవసరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. దీనికి కారణం.. దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరగటమే. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

ఏప్రిల్ 6వ తేదీ నాటికి దేశంలో లక్ష కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని స్కూల్స్, కాలేజీలు మూసివేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ మూసివేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాల్లో వారం రోజులు కర్ఫ్యూ విధించారు. మన దేశానికి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దేశం అయితే ఏకంగా వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 8వ తేదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో అత్యవసరం చర్చించనున్నారు ప్రధానమంత్రి మోడీ. అదే రోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా లేక పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తారా.. లేకపోతే రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తారా అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణ లాక్ డౌన్ అయితే విధించే పరిస్థితి ఉండదని.. పాక్షికంగా మూసివేతలు ఉండొచ్చు అంటున్నారు. రద్దీగా ఉండే ఆలయాలు, సినిమా హాళ్లు, మాల్స్, వైన్స్, పబ్స్ మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు