పోలేరమ్మ దేవాలయం భూమి అమ్మకం.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం సమీపంలోని పోలేరమ్మ గుడికి సంబందించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు అనధికారికంగా అమ్మేశారు. దీనిపై ప్రశ్నించిన వారిని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దేవాదాయ భుముని అమ్మడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామంలోని కొందరు పెద్దలు ఈ స్థలాన్ని అమ్మినట్లు తెలుస్తుంది. పెద్దల హస్తం ఉండటంతో ఎవరు దీనిపై మాట్లాడలేక పోతున్నారు. ఇక మాట్లాడిన వారిని బెదిరిస్తున్నారు. భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న వారికి ఏ పార్టీ కూడా సప్పోర్ట్ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

అమ్మకంలో వారికీ కూడా ముడుపులు ముట్టినట్లు తెలుస్తుంది. అందుకే గ్రామంలోని వివిధ పార్టీల నేతలు ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. అక్కడ పోరాటం చేస్తున్న వారికి కొన్ని హిందూ సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే ఇప్పటికే స్థలం కొన్నవారు దానిని శుభ్రం చేశారు. అందులో ఉన్న పురాతన బావిని పూడ్చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే భూమిని కాపాడాలని కోరుతున్నారు హిందూ సంఘాల నేతలు. దీనికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పోలేరమ్మ దేవాలయం భూమి అమ్మకం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు