చంద్రబాబు సంకేతాలు ఇచ్చే టైంలో.. జగన్ సీన్ రివర్స్ చేశారా.. ఆ అజ్ణాతవాసి ఎవరు?

చంద్రబాబు సంకేతాలు ఇచ్చే టైంలో.. జగన్ సీన్ రివర్స్ చేశారా.. ఆ అజ్ణాతవాసి ఎవరు?

jagan babu modi
jagan babu modi

చంద్రబాబు సంకేతాలు ఇచ్చే టైంలో.. జగన్ సీన్ రివర్స్ చేశారా.. ఆ అజ్ణాతవాసి ఎవరు?

సామాన్యులు ఆలోచన శక్తికి.. ఆలోచనా విధానానికి కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు రాజకీయ పార్టీల అధినేతలు.. అందుకే రాజకీయ పార్టీలు పెట్టగలుగుతున్నారు.. సీఎంలు అవుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆషామాషీగా ఏమీ లేవు.. ఓ వ్యూహాత్మక ఎత్తుగడతో జరుగుతున్నాయి.

2021, మే 7వ తేదీన బీజేపీ అగ్రనాయకత్వాన్ని, ప్రధానమంత్రి మోడీని పొగుడుతూ.. ఆయనకు మద్దతుగా చత్తీస్ ఘడ్ సీఎంకు సున్నితంగా చురకలు అంటిస్తూ ట్విట్ చేశారు సీఎం జగన్. కరోనా కట్టడిలో మోడీ విఫలం అయ్యారని ప్రపంచం అంతా అంటున్న టైంలో.. ఆయనకు బహిరంగంగా మద్దతు తెలిపిన ఏకైక సీఎం జగన్. ఉరుము, మెరుపు లేకుండా ఇలాంటి ట్విట్ చేయటం ఏంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సైతం అవాక్కయ్యారు. జగన్ ట్విట్ వెనక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు ఓ సంచలన నిర్ణయానికి.. సంకేతాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారంట. తిరుపతిలో పార్టీ ఓటు బ్యాంక్ 7 శాతం తగ్గిపోవటంతోపాటు.. బీజేపీ, జనసేన పొత్తు వల్ల భవిష్యత్ లో వచ్చే పొలిటికల్ ఈక్వేషన్స్ అంచనా వేసిన చంద్రబాబు.. బీజేపీ అగ్రనాయకత్వానికి ఓ సంకేతం పంపాలని నిర్ణయించారంట. ఏపీలో పొత్తు పెట్టుకుందాం.. కలిసి నడుద్దాం.. గతం కంటే బీజేపీ అధిక సీట్లు ఇస్తాను.. తద్వారా పాత బంధాన్ని మరింత బలోపేతం చేయటంతోపాటు.. 2014 ఎన్నికల బంధాన్ని కొనసాగిద్దామని సంకేతాలు పంపించారంట. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో ఇప్పటికే ఆ పార్టీకి బోధపడటంతో.. సరైన సమయంలో.. సరైన వ్యూహంతో.. సరైన ఈక్వేషన్ ద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారంట.

ఈ విషయాన్ని టీడీపీ నుంచే తెలుసుకున్న సీఎం జగన్.. అత్యంత వ్యూహాత్మకంగా ప్రధాని మోడీని సపోర్ట్ చేస్తూ ట్విట్ చేశారు. తద్వారా మోడీ ఇమేజ్ ను కాపాడటానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను.. బీజేపీకి అవసరమైన సమయంలో సంపూర్ణ మద్దతు ఇస్తాను అంటూ బీజేపీ హైకమాండ్ కు ఒకే ఒక్క ట్విట్ ద్వారా తన వైఖరి.. తన పార్టీ వైఖరి ఏంటో చెప్పేశారు.

సీఎం జగన్ ట్విట్ తర్వాత.. బీజేపీ హైకమాండ్ కు చంద్రబాబు పంపాలనుకున్న సంకేతాలకు బ్రేక్ పడిందంట. అయితే చంద్రబాబు బీజేపీకి పంపిస్తారనున్న సంకేతాలను.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీక్ చేసింది ఎవరు.. ఆ అజ్ణాతవాసి ఎవరు అంటూ చంద్రబాబు ఆరా తీయటం మొదలుపెట్టారంట. ప్రధాని మోడీకి మద్దతుగా సీఎం జగన్ చేసిన ట్విట్ వెనక అసలు రహస్యం అని టాక్ నడుస్తోంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు