ఓట్లకు డబ్బులు ఇచ్చే బదులు.. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు కదా రాజకీయ పార్టీలు.. ఎంత మంది సమర్థిస్తారు..

ఓట్లకు డబ్బులు ఇచ్చే బదులు.. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు కదా రాజకీయ పార్టీలు.. ఎంత మంది సమర్థిస్తారు..

political partis free vaccine
political partis free vaccine

ఓట్లకు డబ్బులు ఇచ్చే బదులు.. ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు కదా రాజకీయ పార్టీలు.. ఎంత మంది సమర్థిస్తారు..

దేశంలో ఎన్నికల జరుగుతూనే ఉంటాయి.. కరోనా అని ఆగవు.. వరదలు, తుఫాన్ లు, విపత్తులు వచ్చినా.. జనం చస్తున్నా.. రాజకీయ పార్టీలకు అధికారం కావాలి.. ఓటుకు నోటు ఇవ్వటం కామన్.. కరోనా కాలంలో.. ఓటుకు నోటు బదులు వ్యాక్సిన్ వేయించొచ్చు కదా అంటున్నారు జనం.

దేశంలో ఎన్నికలు అంటే వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఒక పార్టీ అని కాదు.. అన్ని పార్టీలదీ ఇదే దారి. ఏరియా బట్టి రేటు మారుతుంది అనేది అందరికీ తెలిసిన సత్యమే. మొన్నటికి మొన్న ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక దేశంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేది, అసోం ఎన్నికల జరిగాయి.

ఎంత లేదన్నా ఒక్కో పార్టీ వేల కోట్ల అయితే ఖర్చు చేసి ఉంటుంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, మీటింగ్స్, ప్రచార సామాగ్రి ఇలా డబ్బులు తగలేసింది. ఇన్నేసి కోట్లు తగలేసినా.. పోలింగ్ ముందు రోజు ఓటుకు నోటు అనేది అందరికీ తెలిసిందే.. ఇప్పుడు డబ్బుల కంటే ముఖ్యమైంది వ్యాక్సిన్.

నోటుకు 2 వేల నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చు చేసే రాజకీయ పార్టీలు.. అదే ఓటరుకు వెయ్యి రూపాయలు పెట్టి వ్యాక్సిన్ వేయించలేవా.. ఇదే ఇప్పుడు అందరికీ డౌట్. ఓటు కోసమేనా ఓటర్.. వ్యాక్సిన్ వేయించటానికి పనికి రాడా అంటున్నారు జనం.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెండు డోసులకు 1,200 రూపాయలు అవుతుంది వ్యాక్సిన్ కోసం.. ఓటుకు 5 వేలు ఇచ్చే రాజకీయ పార్టీలు.. ఇప్పుడు 12 వందలు ఖర్చు చేయలేవా అనేది పాయింట్. అధికారం కావాలంటే ఓట్లు పడాలి.. ఓటు వేసే ఓటరు ప్రాణం ముఖ్యం కాదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు