అఖిల ప్రియ ఇంట్లో ఆస్తి గొడవలు.. రాజకీయంగా ఇబ్బందులు.. వైసీపీలోకి రావటానికి లాబీయింగ్

bhooma akhila priya trying to join ysrcp

టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన అఖిల ప్రియ మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాది కాలంగా ఉన్న రాజకీయ, వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలతో చిరాగ్గా ఉన్న అఖిల ప్రియ.. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవటం ద్వారా టెన్షన్ తగ్గించుకోవాలని చూస్తున్నారు.

అఖిల ప్రియ బంధువులు, చుట్టాలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కేవలం అఖిల ప్రియ మాత్రమే టీడీపీలోకి వచ్చారు. హైదరాబాద్ లోని కిడ్నాప్, ల్యాండ్ ఇష్యూలో జైలుకు వెళ్లిన అఖిలప్రియ.. ఆ తర్వాత నుంచి కుటుంబంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. చెల్లులుతో ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తర్వాత.. చెల్లెలుతోపాటు ఇతర ఆర్థిక వ్యవహారాల్లో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నంద్యాల డైరీ కూడా తన చేతుల్లో నుంచి వెళ్లిపోవటంతో.. ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది.

తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దలు లభించటం లేదంట. జైలుకు వెళ్లినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ పెద్దగా పట్టించుకోలేదంట. దీంతో మనస్తాపానికి గురైన అఖిలప్రియ పార్టీ వ్యవహారాలకూ దూరంగా ఉంటున్నారు.

ఇదే సమయంలో మేన కోడలు జీవితాన్ని చక్కదిద్దేందుకు మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారంట. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మోహన్ రెడ్డి.. అఖిలప్రియకు స్వయానా మేనమామ. అదే విధంగా తమ్ముడు బ్రహ్మానందరెడ్డి మామ.. కాటసాని రామిరెడ్డి. ఇతను బనగానపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు.

బంధువులు, చుట్టాలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండటంతో.. తాను కూడా తిరిగి జగన్ చెంతకు చేరాలని నిర్ణయించారంట. ఈ విషయంపై ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పటికే సీఎం జగన్ చెవిలో వేశారని.. అయితే కొన్ని ఆగుదాం అని చెప్పినట్లు తెలుస్తోంది. భూమా ఫ్యామిలీకి ఉన్న రాజకీయ పలుకుబడి నంద్యాల, ఆళ్లగడ్డలో రోజురోజుకు తగ్గుతున్న క్రమంలో.. అధికార పార్టీలోకి వచ్చి.. బంధువుల అండదండలతో మళ్లీ వెలగాలని ప్లాన్ చేస్తున్నారంట.

అఖిల ప్రియ రాకపై ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు ఆగాలని చెప్పినట్లు సమాచారం. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. అఖిలప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు