ముఖ్యమంత్రిగా కేటీఆర్.. శుభాకాంక్షలు చెప్పిన పద్మారావు

తెలంగాణలో సీఎం మార్పు జరిగేలా కనిపిస్తుంది. త్వరలో కేసీఆర్ తన పదవిని కుమారుడు, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కు కట్టబెట్టనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆ పార్టీ నేతలు కూడా కేటీఆర్ ను సీఎంగా చూడాలని ఆశపడుతున్నారట. కేసీఆర్ రాజకీయాలనుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రతిపక్ష పార్టీల నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా బీజేపీలో చేరిన విజయశాంతి కూడా కేసీఆర్ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది ఇలా ఉంటే శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగుల సమక్షంలో మాట్లాడుతూ కాబోయే సీఎం కేటీఆర్ కు శుబాకాంక్షలని పద్మారావు గౌడ్ అన్నారు. ఈ సమయంలో కేటీఆర్ అక్కడే ఉన్నారు. పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్ సీఎం కాబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది.

కాగా కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారనే వార్త దుబ్బాక ఎన్నికల నాటి నుంచే బలంగా వినిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ సాధించి ఉంటే ఇప్పటికే కేటీఆర్ సీఎం అయ్యేవారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ మేయర్ వ్యవహారం తేలిన తర్వాత కేసీఆర్ చేతిలో సీఎం పదవి పెట్టె అవకాశం కనిపిస్తుంది.

ముఖ్యమంత్రిగా కేటీఆర్.. శుభాకాంక్షలు చెప్పిన పద్మారావు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు