జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలి – తిరుగుబాటు పిలుపా ఏంటీ

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలి - తిరుగుబాటు పిలుపా ఏంటీ

హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. మీరేం ఫికర్ కాకండి.. ఈ మాట అన్నది తెలుగుదేశం పార్టీ మోస్ట్ సీనియర్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మార్చి 29వ తేదీ టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బుచ్చయ్యచౌదరి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది.. త్వరలోనే పార్టీలో భారీ మార్పులు రాబోతున్నాయని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. యువ నాయకత్వంతోపాటు.. పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని స్పష్టం చేశారు.

టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతున్నది. మీరు ఊహించని నిర్ణయాలు జరగిపోతాయి.. ఎవరూ అధైర్యపడొద్దు.. ఆందోళన పడొద్దు అని స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలి.. టీడీపీని కాపాడాలన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పని వాడుకున్న అందరూ ఇప్పడు బయటకొచ్చి పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు బుచ్చయ్యచౌదరి

టీడీపీకి కొత్త నాయకత్వం రాబోతున్నదని.. పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని బుచ్చయ్యచౌదరి లాంటి మోస్ట్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనటం సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగిన సమయంలో.. కొంత మంది వెన్నుపోటు అంటారు.. ఆ సీన్ లో బుచ్చయ్యచౌదరి కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇంత పెద్ద మాటలు మాట్లాడటం చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది.

మార్చిపోయి ఏప్రిల్ వస్తుంది.. మే 2న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాలు వస్తాయి.. ఆ తర్వాత రెండు నెలలకు ఆగస్ట్ నెల వస్తుంది.. టీడీపీలో మళ్లీ ఆగస్ట్ సంక్షోభం తప్పదా ఏంటీ అని అనుకుంటున్నారు రాజకీయ పార్టీల్లోని నేతలు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు