ఎమ్మెల్యే సీతక్కకు నం బెయిలబుల్ వారెంట్

విచారణకు హాజరు కాకపోవడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఓ కేసు విషయంలో ఈమె కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9 లోపు వారెంట్ అమలు చెయ్యాలని ములుగు పోలీసులకు ఆదేశాలిచ్చింది కోర్టు. కాగా శుక్రవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ జరిగింది.

పలు కేసుల్లో అభియోగాలు ఎదురుకుంటున్న ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. వారిలో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. తెలంగాణకు చెందినమంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పొన్నం ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పి.చంద్రశేఖర్, కాశీపేట లింగయ్య, జాజల సురేందర్‌లు కోర్టుకు హాజరయ్యారు. వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి కోర్టు సమన్లు పంపింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై మూడు కేసులను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు