ఆరునెలలకే నడక పదేళ్లకే 10th క్లాస్ : ఇది రఘునందన్ రావు స్టోరీ

raghu nandarao father about his vicotry

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించండంతో రఘునందన్ రావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన విషయం అందరికి తెలిసిందే. TRS పార్టీపై విజయం సాధించిన రఘునందన రావు తల్లిదండ్రులను Mirrot TV అనే ఒక వెబ్ ఛానెల్ లో జర్నలిస్ట్ విజయా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రఘునందనరావు గురించి అనేక ఆసక్తికర విషయాలు ఆయన తల్లిదండ్రులు వివరించారు.

రఘుది కృష్ణుడి అంశ కొప్పుతో పుట్టాడు

తనకు ఉన్న నలుగురు కొడుకుల్లో రఘునందనరావు మొదటి వాడని, పుట్టడం పుట్టడమే తల మీద కొప్పుతో పుట్టాడని ఆయన తల్లి చెప్పారు. ప్రతి ఒక్కరు నీ కొడుకు మహాజాతకుడు కచ్చితంగా గొప్పవాడు అవుతాడని అనేకమంది చెప్పినట్టు ఆమె వెల్లడించారు. పుట్టిన ఆరు నెలలకే నడవడం, పరిగెత్తడం చేశాడని చెబుతూ ముచ్చటపడ్డారు.

పదేళ్ల పదో తరగతి – వయస్సు మార్చాల్సి వచ్చింది

చిన్నప్పటి నుండే చదువులో రఘునందనరావు చురుకుగా ఉండేవాడని ఆమె చెప్పారు. ఏదైనా ఒక్కసారి చూస్తే అలా పట్టేసేవాడని, స్కూల్లో చేరిస్తే మొత్తం చదివేసి,” నాకు మొత్తం వచ్చేసింది- ఇక నేను ఆ క్లాస్ చదవను అనే వాడని ఆమె వెల్లడించారు”. పది సంవత్సరాల వయస్సుకే 10వ తరగతి రాస్తానని పట్టుబడితే తప్పని సరిపరిస్థితుల్లో వయస్సును 12 సంవత్సరాలుగా మార్చి రాయించి పరీక్ష రాయించామని ఆమె చెప్పుకొచ్చారు.

ఉన్న డబ్బులన్ని TRS కే ఖర్చు పెట్టాడు

కేసీఆర్ TRS పార్టీ పెట్టిన వెంటనే అందులో చేరిన రఘు అప్పట్లోనే లక్షల రూపాయలు ఖర్చుపెట్టుకోని పార్టీ కోసం విపరీతంగా కష్టపడ్డాడని, డబ్బులు మొత్తం పోగొట్టుకోని అనేక ఇబ్బందులు పడినట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ పార్టీని నుండి సస్పెండ్ చేసినప్పుడు తాను పడిన భాధను వర్ణించలేమని ఆమె వెల్లడించారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు