భలే లాజిక్ పట్టిన రేవంత్ రెడ్డి – బ్యా గ్రౌండ్ ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో ?

revanth reddy counters to trs party leaders words

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిన నాటి నుండి ఆయన పై వస్తున్న ఆరోపణ ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి, చంద్రబాబు మనిషి.. చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపించాడు అని. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మనిషి.. అందునా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఓటుకు నోటు కేసులో బుక్ అవడంతో.. TRS పార్టీ వాళ్లు తెలుగుదేశం మనిషి, ఓటుకు నోటు అంటూ వేసే పంచ్ లకు, సెటైర్లకు పెద్దగా రియాక్ట్ కాకుండా లైట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. నిజానికి అక్కడ ఎలా కౌంటర్ వేయాలో తెలియక సైలెంట్ అయ్యాడని చెప్పడం కరెక్ట్ అనుకుంట.

ఇన నాలుగైదు రోజుల కిందట.. నాలుగైదు అంటే నాలుగైదు కాదు, కొన్ని రోజుల కిందట, తెలంగాణ కాంగ్రెస్ పార్టికి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మరుక్షణం నుంచి TRS నేతలు డోస్ పెంచి రేవంత్ చంద్రబాబు కోవర్డ్, రేవంత్ తెలుగుదేశం కోవర్ట్, రేవంత్ చంద్రబాబు డబ్బుతో అధ్యక్ష పదవి కొనుకున్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పేరు పెట్టుకున్న తెలుగుదేశం వ్యక్తి అని ఎక్కేయడం మొదలు పెట్టాడు. అయితే రేవంత్ కు ఎలా కౌంటర్ వేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో వరుసగా TV5, Etv, ABN వంటి ఛానెళ్ల అధినేతలను  కలిశాడు రేవంత్ రెడ్డి. ఒక నోక దశలో రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన Tv9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ సలహాదారుడిగా ఉన్నాడని వార్తలు సైతం వచ్చాయి. అది మనం రాసాం చదవండి.   వాళ్లందరిని కలిసిన ప్రభావమో, వాళ్లలో ఎవరైనా రేవంత్ కు నిజంగానే సలహాదారులుగా వ్యవహరిస్తున్నారో లేక ఆయనకే ఈ ఆలోచన తట్టిందో తెలియదు, సడెన్ గా ట్రాక్ మార్చి.. ఏమి కేసీఆర్ నువ్వు ఏ పార్టీ, నీ కొడుకు కేటీఆర్ కి , నీ అల్లుడు హరీశ్ రావుకు లైఫ్ ఇచ్చింది ఏ పార్టీ.. అసలు నీ పార్టీలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఏ పార్టీ నీతో సహా అందరూ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు కాదా అంటూ కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. నేను తెలుగుదేశం కాంగ్రెస్ నేతను అయితే, నువ్వు నీ పార్టీ తెలుగుదేశం TRS అని కౌంటర్స్ వేస్తున్నాడు.  ఒక రకంగా రేవంత్ అన్నదానిలో వాస్తవం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ పాయింట్ ని తప్పకుండా పట్టుకుంటారు. వాళ్లకి మాత్రం తెలియదా ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీలో చేరి ఏం చేస్తున్నారో.

రేవంత్ రెడ్డి వెనక  ఈ స్థాయి సలహాలు ఇస్తూ, ఇలా కౌంటర్లు వేయాలని చెప్పే టీమ్ ఉందనుకోవడం పొరపాటే అవుతుంది. బహుశ ఆయన మంచి నిద్రలో ఉన్నప్పుడో లేక బాత్ రూమ్ లో ప్రశాంతంగా  ఉన్నప్పుడో తళుక్కున ఈ ఆలోచన తట్టి ఉంటుందేమో.

ఇది వేరే వార్త : జగన్ కు సవాల్ గా శ్రీకాకుళం మంత్రి వర్గ విస్తరణ.. అందరూ నమ్మిన బంట్లే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు