ఈ నెల 8న ఆ జిల్లా మహిళలతో షర్మిల సమ్మేళనం

వైఎస్ షర్మిల తెలంగాణలో తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వివిధ జిల్లాల నేతలు, అభిమానులతో ఆమె భేటీ అవుతున్నారు. పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మార్చి 8 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మహిళలతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు షర్మిల ప్రధాన అనుచరుడు రాఘవరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా రాఘవరెడ్డి టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ జెండా కప్పుకున్నోళ్ళకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిలో టీఆర్ఎస్ విఫలమైందని మండిపడ్డారు.

అన్ని రంగాల్లో తెలంగాణను వెనక్కు నెట్టారని ఆరోపించారు. వైఎస్‌ కుటుంబ సభ్యులపై రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడితే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబుకు తొత్తులా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు ప్రస్తావన తెస్తూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ని లెక్కేంత అంటూ రాఘవరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఈ నెల 8న ఆ జిల్లా మహిళలతో షర్మిల సమ్మేళనం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు