నేతలతో నిండిపోతున్న తిరుపతి ప్రచారం – ఏ పార్టీనుండి ఎవరెవరంటే ?

నాగార్జునసాగర్ బరిలో 41 మంది - గెలుపెవరిది

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దృష్టి తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. ప్రధాన పార్టీల కీలక నేతలు అందరూ తిరుపతిలో  మకాం వేసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ చెందిన మంత్రులంతా తిరుపతి ప్రచారం పాల్గొంటున్నారు. పెద్దిరెడ్డి ఊరువాడా తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం వైసీపీ నేతల్లో సగం మంది తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక టీడీపీ నుంచి చంద్రబాబు పర్యటన ఖరారైంది. లోకేష్ ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ లో కలియదిరుగుతున్నారు. బీజేపీ, జనసేన కూడా ప్రచారం జోరుగా చేస్తున్నాయి. ఏప్రిల్ 3 న జనసేనాని తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొదట ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ప్రచారం కోసం తిరుపతి వెళ్లనున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేణిగుంటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు నేతలు సిద్ధమయ్యారు.

ఇక బీజేపీ నుంచి జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు, సునీల్ డియోడర్, టీజీ వెంకటేష్ తోపాటు పలువు ప్రముఖ నేతలు తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఇక్కడ కూడా హిందూ ఎజండా తోనే వెళ్తుంది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ప్రజలకు తెలియచేస్తూ ముందుకు వెళ్తున్నారు.

కేంద్ర నాయకులు ప్రచారానికి వస్తుండటంతో అంచనాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదని భావించిన జగన్ తిరుపతిలో ప్రచారం నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. మొదట తిరుపతిలో మంచి ఊపు మీద ఉన్న వైసీపీ ఇప్పుడు కొద్దిగా డౌన్ అయినట్లు కనిపిస్తుంది. వర్గాల వారీగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ను ప్రచారంలో దింపేందుకు సిద్ధమయ్యారు. ఇక రోజా కూడా రెండు మూడు రోజుల్లో ప్రచారంలోకి వస్తారని తెలుస్తుంది. రెండు శస్త్రచికిత్సలు కావడంతో ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలనే డాక్టర్ల సూచన మేరకు రోజా ఇంటికే పరిమితం అయ్యారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు