బీజేపీలోకి ప్రముఖ సినీ నటుడు

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మంచి పేరు, పలుకుబడి ఉన్న నేతలను ఆకర్షిస్తుంది. మమతా కోటలు బద్దలు కొట్టాలి అంటే బీజేపీ గౌండ్ వర్క్ బాగా చెయ్యాలి.. దీనికి తోడు జనాకర్షణ కలవారిని పార్టీలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇదే పద్దతి ఫాలో అవుతుంది బీజేపీ.. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపద్యంతో ఏలుతున్న మమతా దీదీని ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. రెండు సార్లు కూడా అత్యధిక మెజారితో గెలిచినా దీదీ మూడోసారి కూడా అధికారం చేపట్టాలని ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇక ఇక్కడ ప్రధానంగా పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. అయితే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

ఇక బీజేపీ సభలు సమావేశాలతో పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుంది. గతంలో పెద్దగా ప్రాబల్యం లేని బీజేపీ, అంచలంచలుగా ఎదుగుతుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోయింది.. 18 స్థానాల్లో విజయం సాధించింది. ఇంతటి విజయం సాదిస్తుందని దీదీ కూడా ఉహించి ఉండరు. కమ్యూనిస్ట్ కోటలను దీదీ బద్దలు కొట్టిన తర్వాత మరో పార్టీ ఇంతపెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలను సాధించడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చాయి. కానీ 2019 వచ్చేసరికి 2 నుంచి 18 కి చేరింది.

ప్రజాదరణ ఉన్న నేతలను, అధికార పార్టీలో అసమ్మతి నేతలను బీజేపీ చేర్చుకుంటుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ (బెంగాల్‌ చిత్రపరిశ్రమ) యంగ్‌ హీరో యాష్‌ దాస్‌గుప్తాను పార్టీలోకి ఆహ్వానించింది. బీజేపీ పిలుపుమేరకు గురు, శుక్రవారాలలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సమీప వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. కాగా 2016లో విడుదలైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రంతో యాష్‌ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటింటి ఆయనకంటూ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు.

బీజేపీలోకి ప్రముఖ సినీ నటుడు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు