పవన్ కల్యాణ్ ఊసరవెళ్లి కాకపోతే ఏంటీ – ప్రముఖ నటుడి వ్యాఖ్యలతో కలకలం

పవన్ కల్యాణ్ ఊసరవెళ్లి కాకపోతే ఏంటీ - ప్రముఖ నటుడి వ్యాఖ్యలతో కలకలం.. 2019 ఎన్నికల్లో తీవ్రంగా విబేధించారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నారని.. బీజేపీలో ఏం నచ్చిందని నిలదీశారు.

prakash raj vs pawan

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల జాతీయ స్థాయిలో కాక రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీ సైతం ఇందులో ఇన్వాల్వ్ కావటంతో మొదటిసారి. బీజేపీ – జనసేన బంధంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. ఓ ప్రాంతీయ పార్టీ అయ్యి ఉండి జనసేన.. ఓ జాతీయ పార్టీతో కలవటం ఏంటీ అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో బీజేపీని ఆహోఓహో అన్న అతనే.. 2019 ఎన్నికల్లో తీవ్రంగా విబేధించారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నారని.. బీజేపీలో ఏం నచ్చిందని నిలదీశారు.

జనసేన పార్టీకి స్వతహాగా ఓట్లు ఉన్నాయా లేవా.. రాజకీయాల్లో ఆ పార్టీ వైఖరి ఏంటో కూడా పవన్ కల్యాణ్ కు తెలియదని సంచలన కామెంట్లు చేశారు. ఇప్పటికే మూడు సార్లు బీజేపీని వ్యతిరేకించి.. రెండు సార్లు మద్దతు ఇస్తున్న జనసేన పార్టీ గురించి ఏం మాట్లాడతాం అని.. ఊసరవెళ్లి కాకపోతే ఏంటీ అని నేరుగా పవన్ ను ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.

ఓ ప్రాంతీయ పార్టీ జనసేనకు ఉన్న ఓట్లు ఏంటీ.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న ఓటు శాతం ఎంతో తెలుసుకుని.. రాజకీయం చేయాలని సూచించారు ప్రకాష్ రాజ్. జనసేన పార్టీ బీజేపీతో కలవటటమే ఊసరవెళ్లి రాజకీయాలు అని నేరుగానే కామెంట్ చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు