పశ్చిమ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే జరిగింది.. బీజేపీపై ఛాలెంజ్ చేసి గెలిచిన వ్యూహకర్త..

పశ్చిమ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే జరిగింది.. బీజేపీపై ఛాలెంజ్ చేసి గెలిచిన వ్యూహకర్త..

prashant kishor challenge to bjp in west bengal elections
prashant kishor challenge to bjp in west bengal elections

పశ్చిమ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే జరిగింది.. బీజేపీపై ఛాలెంజ్ చేసి గెలిచిన వ్యూహకర్త..

భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ఒక్క పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పదేళ్ల మమతా బెనర్జీని ఓడించి.. బీజేపీ అధికారంలోకి రావాలని సర్వ శక్తులు ఒడ్డింది. పదేళ్ల అధికారంలో ఉండటంతో సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి.. అధికారంలోకి రావాలంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే ప్రత్యర్థి బీజేపీ.. కేంద్రంలో పవర్ లో ఉంది.. దీంతో.. ముందస్తు జాగ్రత్తగా.. రెండేళ్ల ముందే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది దీదీ.

ఎప్పుడైతే పీకే. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగాడో.. అప్పుడే పోటీ మరింత రసవత్తంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది.. బీజేపీ ఓడిపోవటం ఖాయం అంటూ పీకే పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా.. టీఎంసీ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకించినా.. పార్టీ నేతలు వారించినా సరే.. 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. దీనిపై టీఎంసీ పార్టీలోనే నిరసనలు వ్యక్తం అయినా.. భారం అంతా ప్రశాంత్ కిషోర్ పై వేసిన దీదీ.. పీకే చెప్పినట్లే చేసింది.

ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఓ ఛాలెంజ్ చేశాడు.. బీజేపీ 100 సీట్ల కంటే అధికంగా గెలిస్తే.. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని.. ఇంకెప్పటికీ ట్విట్టర్, ఫేస్ బుక్ వినియోగించనని ఛాలెంజ్ చేశాడు. బీజేపీకి 100 సీట్లకు మంచి రావని.. అధికారం టీఎంసీదే అని చెప్పారు. పీకే ఛాలెంజ్ ఎలా ఉన్నా.. మే 2వ తేదీ కౌంటింగ్ లో ఇదే స్పష్టంగా తేలిపోయింది.

292 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఫలితాల్లో.. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 189 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళుతుండగా.. భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రం 98 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. ఇక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ కలిసి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పూర్తి ఫలితాలు తర్వాత.. బీజేపీ ఆధిక్యం మరో 10 సీట్లకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వెస్ట్ బెంగాల్ ఫలితాలను చూస్తుంటే.. పీకే ఛాలెంజ్ గుర్తుకు రావటం విశేషం. ఎందుకంటే.. ఈ ప్రశాంత్ కిషోరే.. 2019 ఏపీ అసెంబ్లీలో ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున.. సీఎం జగన్ తో కలిసి పని చేశాడు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు