ఈ బీహార్ వ్యూహకర్త.. పార్టీని బంగాళాఖాతంలో కలిపాడు : టీడీపీ నేతల అంతర్మథనం

Prashanth Kishore : మన పార్టీ ఏంటీ.. మన పార్టీ సిద్దాంతం ఏంటీ.. మన పార్టీ అధినేత ఏంటీ.. మన యువనేత సత్తా ఏంటీ.. ఇవన్నీ అంచనా వేయకుండా.. 40 ఏళ్ల పార్టీని.. 40 ఏళ్ల అనుభవాన్ని ఈ బీహార్ వ్యూహకర్త బంగాళాఖాతంలో కలిపాడు.. వీడెక్కడి వ్యూహకర్తే అర్థం కావటం లేదు.. రెండేళ్ల ప్రతిపక్షంలో ఉండి కూడా.. కనీసం గత ఎన్నికల్లో సాధించిన ఓట్లు కూడా సాధించలేకపోయాం.. ఇదెక్కడి వ్యూహం రా బాబూ అంటూ తలపట్టుకుంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత.. లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాను పటిష్ఠం చేయటానికి ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసిన రాబిన్ శర్మ అనే వ్యక్తిని తీసుకొచ్చి ప్రచార బాధ్యతలు అప్పగించారు. షోటైమ్ కన్సల్టింగ్ అనే సంస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ డిజిటల్, సోషల్ మీడియాతోపాటు పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా బాధ్యతలు అప్పగించారు లోకేష్ బాబు.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటీ అంటే ఏ వ్యూహకర్త అంటే బుర్రతో పని చేసేవాడు.. ప్రశాంత్ కిషోర్ కు స్వతహాగా ఉండే బుర్ర, స్ట్రాటజీతో సిబ్బందిని నియమించుకుని.. అందుకు తగ్గట్టుగా ఆయా పార్టీలకు ప్రజంటేషన్ ఇచ్చి.. తన స్ట్రాటజీ అమలు చేస్తాడు. టీడీపీ యువనేత లోకేష్ మరోలా ఆలోచించాడు. ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేశాడు కాబట్టి అంతే బుర్ర, స్ట్రాటజీ ఉంటాయని భావించాడు తప్పితే.. పార్టీకి ఉన్న బలాన్ని, బలహీనతలను విస్మరించి అప్పగించాడు. ఇక్కడే లోకేష్ మళ్లీ తప్పులో కాలేశాడు.

పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీ అధ్యక్షుడు మేనిఫెస్టో విడుదల చేసే స్థాయికి రాబిన్ శర్మ వ్యూహం ఉంది అంటే.. అతనికి ఉన్న బుర్ర ఎలాంటిదో అర్థం అవుతుంది. కనీసం 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు, అతని చుట్టూ ఉన్న ముఖ్యనేతలు అయినా మేనిఫెస్టో ఉండదు అనే సంగతిని విస్మరించారు అంటే పార్టీని నేతలు ఏ విధంగా గాలికి వదిలేశారు అనేది స్పష్టం అవుతుంది.

తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఇది కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి, విజన్ అనే విధానంలో చదువుకున్న వారి మద్దతు. అలాంటి టీడీపీని తీసుకెళ్లి.. మత రాజకీయాలతో ముడిపెట్టారు వ్యూహకర్త రాబిన్ శర్మ. దీని వల్ల టీడీపీకి ఉన్న బడుగు, బలహీన, చదువుకున్న వారిని పార్టీ విధానంపై డైలామాలో పడేసింది. టీడీపీ ఏంటీ బీజేపీ ఎజెండా ఎత్తుకోవటం ఏంటీ అని.. ఇది పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ చేసిన చారిత్రకమైన తప్పు.

చంద్రబాబు, లోకేష్ తోపాటు పార్టీ హిస్టరీ ఏంటీ అనేది వ్యూహకర్తకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే 40 ఏళ్ల పార్టీ స్ట్రాటజీని.. రాష్ట్ర రాజకీయాలతోపాటు.. పార్టీపై అస్సలు అవగాహన లేని వ్యక్తి వచ్చి టేకోవర్ చేయటం వల్ల.. పార్టీ విధానాలు, నిర్ణయాల్లో ఊహించని తప్పులు దొర్లాయి. కనీసం పార్టీ అధినేత, యువనేతకు సరైన స్ట్రిప్ట్ ఇవ్వకపోవటమే కాకుండా.. గత చరిత్రను విస్మరించి ప్రసంగాలు ఇవ్వటం వల్లే ఇలాంటి దారుణమైన ఫలితాలు వచ్చాయి.

వ్యూహకర్త అంటే పార్టీ సిద్దాంతం, విధానాలకు లోబడి బలమైన శక్తిగా మార్చటం.. అలా కాకుండా బలమైన టీడీపీ పునాదులను తొలగించి కొత్తగా నిర్మించటం అంటే అది కుప్పకూలిపోతుంది అనటానికి టీడీపీనే నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వతహాలనే ఉన్న బలాన్ని, బలగాన్ని, పునాదులను కదిలించకుండా.. వాటిని చెట్టు వేర్లుగా మార్చి విస్తరించాడు ప్రశాంత్ కిషోర్.. అది ఆయన బుర్ర, స్ట్రాటజీ.. టీడీపీకి స్వతహాగా ఉన్న వేర్లను తెగ్గొట్టి.. కొత్త వేర్లు వేయాలి అనుకుంటే సింహాన్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే..

అసలు టీడీపీ అంటే ఏంటీ అనేది తెలియని వ్యూహాకర్తను నియమించుకుంటే.. ఇప్పుడు వచ్చిన 30 శాతం ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయినా ఆశ్చర్యం లేదు. నేల విడిచి సాము చేయటం అంటే ఇదే.. ఏమైనా టీడీపీకి మొదటి నుంచీ పొరుగింటి పుల్లకూర.. సూటు బూటు వేసుకున్నోళ్లో అంటేనే సమ్మగా ఉంటుందిలేండీ…

ఈ బీహార్ వ్యూహకర్త.. పార్టీని బంగాళాఖాతంలో కలిపాడు : టీడీపీ నేతల అంతర్మథనం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు