ఎంత బరితెగిస్తే ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా చేస్తాయి – ఆ దేశాల్లో అయితే ఉరి తీసేవాళ్లు

ap private covid hospitals

ఎంత బరితెగింపు.. ఎంత కర్కోటం.. ఎంత బలుపు, అహంకారం ఉంటే ఇలా చేస్తారు.. కనిపించే ఆలయాలు, దేవుళ్లు అంటూ ఆస్పత్రులను, డాక్టర్లను పొగిడేస్తున్నాం కదా.. మరి ప్రైవేట్ ఆస్పత్రులు అలానే చేస్తున్నాయా.. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంది.. మనుషులను బతికించాలని తాపత్రయ పడుతుంది.. అంత ఎందుకు మన దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా.. ఏపీలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

కరోనా పేషెంట్లను చేర్చుకోం.. కరోనాకు ట్రీట్ మెంట్ చేయం.. ప్రభుత్వం దాడులు ఆపాలి.. తనిఖీలు చేస్తే ఊరుకోం.. ఎంత అహంకారం.. బలుపు ఉంటే ప్రైవేట్ ఆస్పత్రులు ఇలాంటి బోర్డులు పెడతాయి.. ఏపీలోని కడప జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు బహిరంగంగా ఇలాంటి బ్యానర్లు కట్టారు అంటే.. వైద్యం, ప్రజల ప్రాణాలపై వీరికున్న శ్రద్ధ ఏంటో స్పష్టం అవుతుంది. బద్ద శత్రువులు అనిపించుకుంటున్న చైనా, పాకిస్తాన్ కూడా సాయం చేస్తాం అంటూ ముందుకు వస్తుంటే, ఈ ప్రైవేటు హాస్పటల్ వాళ్లు మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు.

ఆక్సిజన్ ఎలా ఉంది.. మందుల రేట్లు ఎలా ఉన్నాయి.. ట్రీట్ మెంట్ ఖర్చు ఏంటీ.. ఆరోగ్యశ్రీ కింద వసతులు ఎలా ఉన్నాయి అనే విషయాలపై ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయకూడదంట.. ప్రశ్నించకూడదంట.. సరైన వసతులు లేకపోతే కేసులు పెట్టకూడదంట.. అంటే ప్రైవేట్ ఆస్పత్రులది ఇష్టారాజ్యమా.. లక్షలకు లక్షలు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా.. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిన 10 మంది సజీవ దహనం అయితే ప్రభుత్వ వైఫల్యం అంటారు.. ముందే తనిఖీలు చేస్తే దాడులు అంటారు.. వేధింపులు అంటారా.. ఇదెక్కడి చోద్యం.. ఇదెక్కడి విడ్డూరం..

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది.. ప్రజలు కరోనాకు పిట్టల్లా రాలిపోతున్నారు.. ఇలాంటి టైంలో ఆస్పత్రి ఎదుట వైద్యం చేయం అని బోర్డులు, బ్యానర్లు కట్టారు అంటే ఎంత అహంకారం, బలుపు ఉండాలి వీళ్లకు. ప్రైవేట్ ఆస్పత్రులు అయినా.. ప్రభుత్వ ఆస్పత్రులు అయినా సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఇలాంటి బోర్డులు పెడితే ఉరి తీసేవాళ్లు గతంలో.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు కానీ.. అదే కానీ ప్రకటించి ఉంటే.. ఈ పాటికి వీళ్లు జైళ్లల్లో ఊచలు లెక్కపెట్టేవాళ్లు. ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది..

ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం కింద పని చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పుడే ఇలా బరితెగిస్తే.. బీజేపీ వాళ్లు, ప్రధాని మోడీ విజన్ అయిన ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో జరిగితే.. వీళ్ల ఆగడాలకు హద్దు ఉంటుందా.. ఇంకా రెచ్చిపోరు.. ఆస్పత్రుల్లో రోగులు లేకపోతే బార్లు, పబ్స్ కూడా నడుపుతారు వీళ్లు.. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా మోసాలు జరగటం లేదా.. అవయవాల దానం పేరుతో వ్యాపారం నడవటం లేదా..

డాక్టర్ అయినా కలెక్టర్ అయినా.. సీఎం అయినా పీఎం అయినా.. అందరూ మనుషులే.. అందరూ చచ్చిపోవాల్సిందే.. పోయేలోపు నీచుడు, దరిద్రుడు.. కుక్కచావు చచ్చాడు.. వాడికి అలా కావాల్సిందే.. వాడు పోతే ఏడ్చేవాడు ఎవడురా అని అనిపించుకోకుండా పోతే చాలు. “ఏ తప్పు చేయనప్పుడు ప్రైవేటు హాస్పటల్స్ వారు ఎందుకు భయపడాలి – తప్పు చేసిన వాడు కాదా భయపడాల్సింది అని“, అతి సామాన్యుడు ఆలోచన ఇది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు