ప్రియాంక గాంధీ మిత్రుడు.. కాంగ్రెస్ నేతను చితకబాదిన యువతులు

ప్రియాంక గాంధీ మిత్రుడు.. కాంగ్రెస్ నేతను చితకబాదిన యువతులు

ప్రియాంక గాంధీకి మిత్రుడు. కాంగ్రెస్ పార్టీ నేత అనుజ్ మిశ్రకు దేహశుద్ది చేశారు యువతులు. ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అనుజ్ మిశ్ర ప్రియాంక గాంధీకి మంచి స్నేహితుడు.. ఆమె యూపీ పర్యటనకు వస్తే వెంటుంది నడిపిస్తుంటాడు. ఎం పోయేకాలం వచ్చిందో అమ్మాయిలకు అసభ్యంగా సందేశాలు పంపాడు.

అంతే కాదు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. యువతులు వద్దు మొర్రో అని వేడుకున్న వినలేదు. చివరకు అనుజ్ బాధ భరించలేక రోడ్డుపై పట్టుకొని దేహశుద్ది చేశారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దింతో కాంగ్రెస్ నేత బాగోతం బయటపడింది. ఇక దాడి చేసిన యువతులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కావడం కొసమెరుపు.

అయితే దాడిపై అనుక్ మిశ్ర వాదన మరోలా ఉంది. తాను అసలు వారిని వేదించలేదని, తన వద్ద డబ్బు తీసుకోని ఇవ్వమంటే ఇవ్వకుండా తననే వేధించారని అన్నారు.. వారు తమ పార్టీ కార్యకర్తలేనని ప్రవర్తన సరిగా లేకపోవడంతో సస్పెండ్ చేశామని తెలిపారు. అది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేశారని అన్నారు. ఇక ఈ విషయంపై ఇరువురు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పొలుసులు విచారణ చేపట్టారు.

కాగా యువతులు దాడి అనంతరం అనుజ్ తో కాళ్ళు పట్టించుకున్నారు

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు