పురంధేశ్వరితో పనబాక లక్ష్మి చర్చలు-పోలింగ్ తర్వాత పరిణామాలపై అసహనం

panabaka lakshimi

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత పరిణామాలపై టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి చాలా అసహనంగా ఉన్నారంట. పోలింగ్ ముగిసిన వెంటనే.. ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు.. రెండు వారాల తర్వాత వచ్చిన ఫలితాల తర్వాత సైతం పార్టీ నేతలు ఎవరూ అందుబాటులో లేరు.. పార్టీ ఎందుకు ఓడిపోయింది.. భవిష్యత్ రాజకీయం ఏంటీ అనే విషయంపై ఎవరూ ఆలోచించటం లేదంటూ తిరుపతి టీడీపీ నేతల దగ్గర అసహనం వ్యక్తం చేశారంట పనబాక లక్ష్మి.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పార్టీ కోసం కాకుండా.. చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ పాపులారిటీ కోసం తాహతాహలాడారని.. పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్టపై దృష్టి పెట్టటం వల్లే.. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదని.. ఏడు శాతం ఓట్లు తగ్గటం సామాన్య విషయం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారంట పనబాక లక్ష్మి. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతో.. పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం 2024 ఎన్నికల నాటికి టీడీపీ టికెట్ ఇస్తుందో లేదో అనేది సైతం డౌట్ గా ఉందని కన్ఫామ్ చేసుకుందంట పనబాక లక్ష్మి.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన సహచర కేంద్ర మంత్రి, స్నేహితురాలు అయిన దగ్గుబాటి పురంధేశ్వరితో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని జగన్ స్వయంగా ఆహ్వానించినా కాదని.. టీడీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో.. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నారంట. ఈ క్రమంలోనే పురంధేశ్వరితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి సైతం దళిత నేతల ఆవశ్యకత ఎంతో ఉంది. గత ఎన్నికల్లో సరైన అభ్యర్థి లేకపోవటం వల్లే.. తిరుపతిలో కర్ణాటక నుంచి రత్నప్రభను తీసుకొచ్చి నిలబెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో తన ప్రతాపం చూపించాలంటే.. దళిత అభ్యర్థులు ఎంతైనా అవసరం ఉంది ఆ పార్టీకి. ఆ పార్టీ అవసరాన్ని గుర్తించి.. పనబాక లక్ష్మి బీజేపీ వైపు చూస్తున్నారంట.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీ హైకమాండ్ నుంచి ఓదార్పు లేకపోగా.. కనీసం పలకరింపు సైతం లేదనే ఆవేదనలో ఉన్న క్రమంలో.. బీజేపీ వైపు తన మనసును డైవర్ట్ చేస్తున్నారంట లక్ష్మిగారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు