భీమవరంకి ఎలా వెళ్లాడు పుట్టా మధు – అక్కడ ఆశ్రయం ఇచ్చింది ఎవరు : కోడి పందాల పరిచయం ఇలా ఉపయోగపడిందా

putta madhu in bhemavaram town

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అనుచరుడు, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత పుట్టా మధును అరెస్ట్ చేశారు పోలీసులు. 2021, మే 7వ తేదీ అర్థరాత్రి తెలంగాణ పోలీసులు ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రామగుండం కమిషనరేట్ కు తరలించారు. లాయర్లు వామనరావు హత్య కేసులో పుట్టా మధుపై ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులోనే విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది..

ఇంతకీ జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వారం రోజులుగా తలదాచుకున్నాడు. ఎక్కడికెళ్లాడు.. ఎక్కడ ఉన్నాడు అనే వారం, 10 రోజులుగా ఎవరికీ తెలియదు. కుటుంబ సభ్యులు సైతం ఆందోళనపడి.. ఏకంగా పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ హోదాలో ప్రభుత్వ వాహనం, సెక్యూరిటీ, పీఏను సైతం వదిలేసి.. రాత్రికి రాత్రి ఒక్కరే మాయం అయ్యారు పుట్టా మధు.

మూడు రోజులుగా పుట్టా మధు కోసం గాలిస్తున్న పోలీసులకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమలోని భీమవరంలోని ఓ హోటల్ లో ఉన్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా.. మెరుపుదాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు లాంటి నగరాల్లో కాకుండా.. కోనసీమను ఎంచుకోవటం వెనక వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు పుట్టా మధు అనుచరులు.

జెడ్పీ చైర్మన్ హోదా.. వేల కోట్లకు అధిపతి.. డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రాంతాల్లో ఉన్నట్లు సహజంగా అననుమానిస్తారు పోలీసులు. దీన్ని బ్రేక్ చేయాలనుకున్న మధు.. ఎవరూ ఊహించని కోనసీమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అందులోనూ అన్ని వసతులు ఉన్న భీమవరం అయితే సేఫ్ ప్లేస్ అనుకున్నాడు. కోనసీమలోని ఏ హోటల్ బాగుంటుంటుంది.. ఎక్కడ అయితే ఎవరికీ అనుమానం రాదు అనే విషయాన్ని మాత్రం ఓ స్నేహితుడి ద్వారా.. క్యాజువల్ ఫోన్ కాల్ మీటింగ్ ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడంట మధు. ఆ స్నేహితుడు సంక్రాంతి కోడి పందాల వ్యవహారంలో పరిచయం అంట.. ఆ పరిచయం ద్వారానే ఇప్పుడు.. కోనసీమ సమాచారం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఆ ఫ్రెండ్ సూచన మేరకు.. కోనసీమ ప్రాంతం భీమవరంలోని ఓ హోటల్ లో గది బుక్ చేసుకుని.. 10 రోజులుగా అక్కడే ఉంటున్నాడు. కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న మధు.. ఓ నలుగురు వ్యక్తులతో మాత్రమే టచ్ లో ఉన్నారంట.. వారి ద్వారా పుట్టా మధు ఆచూకీ గుర్తించి.. అదుపులోకి తీసుకుని రామగుండం తీసుకొచ్చారు పోలీసులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు