పుట్టిన రోజు.. అందులోనూ శుక్రవారం.. మూడు రోజులు సెలవు.. టైం చూసి దెబ్బేసిన సీఎం జగన్

పుట్టిన రోజు.. అందులోనూ శుక్రవారం.. మూడు రోజులు సెలవు.. టైం చూసి దెబ్బేసిన సీఎం జగన్

పుట్టిన రోజు.. అందులోనూ శుక్రవారం.. మూడు రోజులు సెలవు.. టైం చూసి దెబ్బేసిన సీఎం జగన్

ఏంటీ పీకేది బొచ్చు.. ఈ విగ్గుపై బొచ్చు కూడా పీకలేరు.. సీఎం జగన్ ఓ చవట.. దద్దమ్మ.. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. మీ అంతు చూస్తానురో.. ఓ వర్గం మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు కామెంట్స్ ఇవి.. ఏడాది కాలంగా పార్టీపై.. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా.. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా టార్గెట్ చేశారు ఎంపీ.

ఇంత కాలం చూసీచూడనట్లు వ్యవహరించిన పార్టీ.. అదును చూసి దెబ్బేసింది. మామూలుగా అరెస్ట్ చేస్తే విమర్శలు, ఆరోపణలు వస్తాయని భావించి వెనకడు వేసి సీఎం జగన్.. అరెస్ట్ కు కావాల్సిన కంటెంట్ స్వయంగా ఇచ్చాడు రఘురామకృష్ణం రాజు.

కరోనా టైంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశాడు. వ్యాక్సిన్ కొనుగోళ్లలో అవినీతి అంటూ.. కరోనాను గాలికొదిలేసిందంటూ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శ్మశానాల్లోని ఫొటో చూపిస్తూ కామెంట్స్ చేశాడు. ఇక్కడే మనోడు దొరికిపోయాడు. సంక్షోభం, మహమ్మారి సమయంలో తప్పుడు వార్తలు, ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. అందుకు సంబంధించి ప్రత్యేక సెక్షన్లు సైతం ఉన్నాయి.

వీటిని ఆధారంగా చేసుకున్న ఏపీ ప్రభుత్వం.. సెక్షన్ 124(ఏ)(బి) కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లోని ఆయన ఇంటికెళ్లిన సీఐడీ అధికారులు.. విజయవాడ తరలించారు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. మే 14వ తేదీ రఘురామ కృష్ణం రాజు పుట్టిన రోజు.. ఉదయమే అందరితో విషెస్ చెప్పించుకున్నారు.. సాయంత్రం సానుభూతి చెప్పించుకున్నారు. అందులోనూ శుక్రవారం.. మూడు రోజులు వరసగా సెలవులు.. శని, ఆదివారం కోర్టులు సెలవు కాబట్టి.. విజయవాడ సీఐడీ ఆఫీసులోనే విచారణ పేరుతో ప్రత్యేక అతిధిగా ఉండనున్నాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు