ఎమ్మెల్యే రఘునందన్ రావు నోటి దురుసుతో.. బీజేపీకి వచ్చే ఓట్లు కూడా పోతున్నాయా

కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లు.. బీజేపీ నోటి దురుసు.. టీఆర్ఎస్ పార్టీకి

దుబ్బాక ఎన్నికల తర్వాత బీజేపీ నేతల ఫైర్ చూసి జీహెచ్ఎంసీలో కూడా ఫుల్ గా దున్నేస్తారు.. గెలిచేస్తారు అని అందరూ అనుకున్నారు.. మూడ్ అలాగే ఉంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా బీజేపీ వైపు వెళుతుంది అని భావిస్తున్న సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నోటి దురుసుతో.. బీజేపీకి వచ్చే ఓట్లు కూడా పోతున్నాయనే టాక్ వచ్చింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆయన చేసినట్లు వస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ అభిమానులు ఉన్నారు. వాళ్లు కరుడుగట్టిన వాదులు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ చేశారు.. మార్పు అనేది కామన్ కాబట్టి.. ఇప్పుడిప్పుడే బీజేపీ వైపు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీని టార్గెట్ చేయటం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కొంచెం ప్రేమ చూపించటం దీనికి కారణం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది బీజేపీకి ప్లస్ అవుతుంది అని అందరూ భావించారు.. టాక్ కూడా అలాగే ఉంది. దీన్ని మరింత బలంగా మార్చుకోవాల్సిన తెలంగాణ బీజేపీ నేతలు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు నిమిషాల్లో వైరల్ అయ్యాయి. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఆయన వ్యాఖ్యలు చేయటం.. అది పరోక్షంగా కానీ.. ప్రత్యక్షంగా కానీ.. ఆయన నోటి నుంచి అయితే రావటంతో సోషల్ మీడియాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెటిజన్లు.. ఒక్కసారి యూటర్న్ తీసుకుని బీజేపీని దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు.

ఇది టీఆర్ఎస్ పార్టీకి అనుకోని వరం.. ఊహించని విజయంగా చెప్పొచ్చు.. కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లు.. బీజేపీ నోటి దురుసు.. టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేలా ఉంది. దీంతో జీహెచ్ఎంసీ బీజేపీకి వచ్చే ఓట్లు కూడా.. ఆ నేతల వ్యాఖ్యలతో చేజేతులారా పోగొట్టుకుంటున్నారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు