రఘురామకృష్ణం రాజు అరెస్ట్.. విజయవాడ తరలింపు.. పెద్దారెడ్డి స్టయిల్ లో ఎత్తుకెళ్లిన సీఐడీ పోలీసులు

రఘురామకృష్ణం రాజు అరెస్ట్.. విజయవాడ తరలింపు.. పెద్దారెడ్డి స్టయిల్ లో ఎత్తుకెళ్లిన సీఐడీ పోలీసులు

raghu
raghu

రఘురామకృష్ణం రాజు అరెస్ట్.. విజయవాడ తరలింపు.. పెద్దారెడ్డి స్టయిల్ లో ఎత్తుకెళ్లిన సీఐడీ పోలీసులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును మే 14వ తేదీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ అధికారులు.

న్యూస్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే విమర్శలు, ఆరోపణలు చేయటం, కరోనా సమయం భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడటం వంటి కారణాలపై రఘురామ కృష్ణం రాజుపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుల విచారణను సీఐడీ అధికారులకు అప్పగించింది ప్రభుత్వం.

సెక్షన్ 120, 153, 505, 124 కింద అరెస్ట్ చేస్తున్నట్లు ఇంటి ముందు నోటీస్ అంటించి మరీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ సమయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు ఎంపీ. ఏయే సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నదీ నోటీస్ అందించటంతోపాటు.. ఇంటి గేటుకు అంటించారు. కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు అంటించారు. అరెస్ట్ సయంలో రఘురామకృష్ణం రాజు భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు.

లాయర్ తో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. 35 మంది అధికారులు బలవంతంగా ఎత్తుకెళ్లారని.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని వారి కుమారుడు అంటున్నాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు