రఘురామ కృష్ణంరాజుకు ఇన్ని రోగాలు ఉన్నాయా.. అందుకు ప్యాంట్ వేసుకోరా.. పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్..

రఘురామ కృష్ణంరాజుకు ఇన్ని రోగాలు ఉన్నాయా.. అందుకు ప్యాంట్ వేసుకోరా.. పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్..

raghuramaraju legs
raghuramaraju legs

రఘురామ కృష్ణంరాజుకు ఇన్ని రోగాలు ఉన్నాయా.. అందుకు ప్యాంట్ వేసుకోరా.. పరీక్షలు చేసిన డాక్టర్లు షాక్..

నర్సాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణం రాజు సీఐడీ కస్టడీలో పోలీసులు కొట్టారని.. అందుకే కాళ్లు వాచాయని.. కమిలిపోయాయని కోర్టులో చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించిన కోర్టు.. వైద్యులతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ముగ్గురు వైద్యులు కాళ్లను పరీక్షించారు.

రఘు రామకృష్ణంరాజును పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు.. ఆయనకు ఉన్న రోగాలు చూసి అవాక్కయ్యారు. శరీరం అంతా చాలా బలహీనంగా ఉందని.. సామాన్యుల భాషలో చెప్పాలంటే లూజుగా ఉంది అంటారు.. ఇక ఎదుర్కొంటున్నా అనారోగ్యాలు సైతం చాలా ఉండటం చూసి అవాక్కయ్యారు.

కాళ్లు అలా ఉండటానికి కారణాలేంటో తెలుసుకుందాం :

> మూడు నెలల క్రితం గుండె ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా కాలి దగ్గర ఉన్న ఓ నరాన్ని తీసి.. గుండె భాగంలో మార్చారు. దీని వల్ల కాలి దగ్గర సహజంగానే కొన్ని గాట్లు ఉంటాయి. అవి ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. వాటి తాలూకూ నలుపుదనం ఉంది. ఇది ఒకటో అంశం.

> ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సొరియాసిస్ వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నోళ్లకు కాళ్ల దగ్గర పుండ్లు ఏర్పడతాయి. వాటిని తగ్గించుకోవటానికి మందులు వాడుతుంటారు. దీని వల్ల నల్ల, ఎరుపు, తెలుపు మచ్చలు అనేవి నిత్యం ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు వీళ్లు నడవటానికి కూడా వీల్లేనంతగా పుండ్లు ఏర్పడతాయి.

> సొరియాసిస్ వ్యాధి ఉన్నోళ్లకు షుగర్ ఉంటే ఆ పుండ్లు ఎప్పటికీ మానకపోగా.. నిత్యం జిల వస్తూ ఉంటుంది. దీని వల్ల కాళ్ల భాగంలో ఎప్పుడూ గోకుతూ ఉంటారు. అదే విధంగా అరికాళ్లు మంటలు వస్తూ ఉంటాయి. రఘురామకృష్ణం రాజు షుగర్ పేషెంట్ కావటం వల్ల ఎన్ని మందులు వాడినా పుండ్లు మానలేదు. వాటినే ఇప్పుడు చూపించారు.

> పోలీసులు కొట్టరు అని కాదు.. కొడితే అలా ఇలా ఉండదు.. నొప్పులు మాత్రమే తెలుస్తాయి.. లోలోపల మంట ఉంటుంది.. సీఐడీ అధికారులకు తెలియందా ఏంటీ థర్డ్ డిగ్రీ అనేది.. ఇవి పోలీసులు కొట్టనవి కాదని తేల్చారు డాక్టర్లు.

> రఘురామకృష్ణం రాజు కొన్నాళ్లుగా లుంగీతోనే ఉంటున్నారు. ప్యాంట్ అసలు వేసుకోవటం లేదు. దీనికి కారణం కాళ్లకు ఉన్న సొరియాసిస్ వ్యాధి అని తేల్చారు. ప్యాంట్ వేసుకునేటప్పుడు.. విప్పేటప్పుడు పుండ్లు రాపిడికి గురయ్యి మరింత మంటను తీసుకొస్తాయంట. అందుకే ప్యాంట్ వేసుకోవటం మానేసి.. ఓన్లీ లుంగీతోనే తిరుగుతున్నారంట.

> ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏడేళ్లుగా సొరియాసిస్, పదేళ్లుగా షుగర్ ఉన్నాయి.. దీర్ఘకాలిక రోగాలు కాబట్టి.. సహజంగా కాళ్లు ఇలా పుండ్లు ఉంటాయి. టెంపరరీగా తగ్గినా.. మళ్లీ పుండ్లు వస్తూ ఉంటాయి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు