2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి.. ప్రశాంత్ కిషోర్ జోస్యం

2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి.. ప్రశాంత్ కిషోర్ జోస్యం

rahul gandhi and prashant kishor
rahul gandhi and prashant kishor

2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి.. ప్రశాంత్ కిషోర్ జోస్యం

భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇదే సిట్యువేషన్.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేళ్లలో అన్నీ ధరలు.. అంటే నిత్యావసరాలు 200 శాతం, పెట్రోల్, డీజిల్ వంద శాతం పెరిగాయి. కరోనాతో బడుగు, బలహీన, మధ్య తరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. ఇలాంటి టైంలో పొలిటికల్ బాంబ్ పేల్చారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.

రాహుల్ గాంధీని.. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయితే.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తానంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉరుము లేకుండా మెరుపు రాదు.. నిప్పు లేకుండా పొగ రాదు.. అలాంటిది ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీతో.. రాహుల్ తో చర్చించకుండానే ఇలాంటి స్టేట్ మెంట్ ఎందుకిస్తారు అనే పాయింట్ సైతం ఉంది.

జూన్ నెలాఖరు నాటికి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నది. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే ప్రకటించింది పార్టీ. సరిగ్గా ఆ టైం దగ్గర పడుతున్న టైంలోనే.. ప్రశాంత్ కిషోన్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వటం వెనక.. ఇప్పటికే స్కెచ్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవసరం చాలా ఉంది. సోషల్ మీడియాలోనూ చాలా వీక్. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల గెలిచినా.. పార్టీని చీల్చి మరీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి టైంలో పార్టీతోపాటు క్యాడర్ ను నిలబెట్టుకోవటం ఎంతో ముఖ్యం. ఆ స్థాయికి రావాలి అంటే మీడియా సపోర్ట్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మీడియా సపోర్ట్ దొరికే అవకాశం లేదు. ఇక మిగిలింది సోషల్ మీడియా. దీన్ని బలంగా.. వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు తీసుకెళ్లాలి అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి అవసరం.

ఈ ఈక్వెషన్స్ ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీపై ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెంట్ చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2024 ఎన్నికలకు పని చేస్తానంటూ ప్రకటన చేయటం చూస్తుంటే.. రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని ప్రశాంత్ కిషోర్ డిసైడ్ అయ్యారా లేక డిసైడ్ చేయబోతున్నారా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు