గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ

మల్కాజిగిరి సిట్టింగ్ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి నియోజకవర్గంతోపాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం..

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ సైతం సై అంటోంది. బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్స్ గా తేజస్విని సూర్య ఇప్పటికే రాగా.. యోగీ ఆదిత్యనాథ్, అమిత్ షా, జేపీ నడ్డా రంగంలోకి దిగుతున్నారు. వీళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా ఆలోచించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకురావాలని నిర్ణయించింది. మల్కాజిగిరి, పాతబస్తీ ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ గోవాలో ఉన్నారు. ఆయన్ను అక్కడి నుంచి హైదరాబాద్ రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ ఇప్పటికే ఆయన్ను కోరారంట.

ప్రచారం చివరి రోజులు అయిన నవంబర్ 29, 30 తేదీల్లో హైదరాబాద్ లో రెండు రోజులు రాహుల్ గాంధీ ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీకి ధీటుగా ఆయన్ను రంగంలోకి దించితే.. మల్కాజిగిరి సిట్టింగ్ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి నియోజకవర్గంతోపాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లిందని.. తుది నిర్ణయం ఆయనదే అంటున్నారు పార్టీ నేతలు.

కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు.. దీన్ని అధిగమించి.. గట్టి పోటీ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ వస్తే బెటర్ అని అంటున్నారు పార్టీ నేతలు. మరి రాహుల్ గాంధీ వస్తారా లేదా అనే ఆసక్తి రేపుతోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు